లీకులిస్తున్న కేసీఆర్‌.. వ్యూహం ఇదేనా..?

సీఎం కేసీఆర్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్ని అర్థం చేసుకోవ‌డం అంత ఈజీ కాదనే అభిప్రాయం చాలామందికి ఉంది. రాజ‌కీయ శ‌క్తుల పున‌రేకీక‌ర‌ణ పేరుతో తెరాస‌కు మాక్సిమ‌మ్ మైలేజ్ వ‌చ్చేలా ఫిరాయింపులు చేప‌ట్టారు! ఇక‌, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా చూసుకుంటే తెరాస ప‌ట్టుకు చిక్క‌ని జిల్లా న‌ల్గొండ అని చెప్పాలి. గ‌త ఎన్నిక‌ల్లో కొంత ఉనికి చాటుకున్నా… ఈ జిల్లాపై కాంగ్రెస్ తోపాటు క‌మ్యూనిస్టుల ప‌ట్టు కూడా బాగానే ఉంటుంది. ఈ పునాదుల్ని క‌ద‌ల‌దీసి తెరాస తిష్ట వేయడం అనేది అంత సులువైన ప‌ని కాద‌నే విష‌యం కేసీఆర్ కూడా తెలుసు. అందుకే, ఈ మధ్య కేసీఆర్ న‌ల్గొండ‌లో పార్టీ ప‌టిష్ట‌త‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు స‌మ‌యం ఉన్నా, ఇప్ప‌ట్నుంచే కొన్ని వ్యూహాత్మ‌క లీకులు ఇస్తున్నార‌ని చెప్పుకోవాలి.

నిజానికి, 2014 ఎన్నిక‌ల్లోనే న‌ల్గొండ జిల్లాలో తెరాస బోణీ కొట్టింది. ఆరు అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాలు ద‌క్కించుకుని.. కాంగ్రెస్ కు మాంచి షాక్ ఇచ్చింది. అయితే, ఈ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన నాయ‌కులున్నారు. జానారెడ్డి, కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ తోపాటు పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కి దెబ్బ త‌గిలినా… 2019 నాటి ప‌రిస్థితి మ‌రోలా ఉండొచ్చు. ప‌రిస్థితులు కాంగ్రెస్ కు కాస్త అనుకూలంగా ఉండే అవ‌కాశం ఉంద‌న్న విశ్లేష‌ణ‌ల్ని కూడా మ‌నం ఈ మ‌ధ్య వింటున్నాం. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే న‌ల్గొండ‌పై తెరాస వ్యూహం ఏవిధంగా ఉండ‌బోతోంద‌న్న‌దానిపై తెరాస నుంచి కొన్ని లీకులు వ‌స్తున్నాయి. ఈ ప్రాంతానికి తెరాస త‌ర‌ఫున ఒక కీల‌క నాయ‌కుడు కావాల‌న్న చ‌ర్చ తెరాస మొద‌లైంద‌ట‌! అయితే, ఇప్పుడు ఆ చ‌ర్చ‌కు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే… ఆ కీల‌క నేత మ‌రెవ్వ‌రో కాదు.. కేసీఆరే..!

అవును, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో న‌ల్గొండ జిల్లా నుంచి కేసీఆర్ పోటీ చేసే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. జిల్లా నుంచి తానే పోటీకి దిగ‌డం వ‌ల్ల అన్ని ర‌కాలుగా క‌లిసి వ‌స్తుంద‌నే భావ‌న‌లో ఉన్నార‌ట‌. ఈ లోగా న‌ల్గొండ‌లో త‌ల‌పెట్టిన సాగు నీటి ప్రాజెక్టుల్ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఉత్త‌ర తెలంగాణ‌లో ఎలాగూ తెరాస‌కు మంచి ప‌ట్టు ఉంది. 2009 నుంచే పాల‌మూరు ప్రాంతంపై బాగానే ఫోక‌స్ చేశారు. ఇక‌, మిగిలింది ద‌క్షిణ తెలంగాణ‌. ఇక్క‌డ పార్టీ కాస్త వీక్ గా ఉంద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. పైగా, కాంగ్రెస్ బ‌ల‌ప‌డే ఛాన్స్ లు ఇక్క‌డి నుంచే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో బోణీ చేసినా కూడా, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌ళ్లీ కాంగ్రెస్ ఖాతాలోకి ఈ జిల్లా వెళ్ల‌కుండా క‌ట్ట‌డి చేయాలంటే… తానే స్వ‌యంగా రంగంలోకి దిగాల‌ని కేసీఆర్ డిసైడ్ అయ్యార‌ట‌.

అయితే, ముందుగానే ఇలాంటి లీక్స్ ఇవ్వ‌డం వ‌ల్ల కాంగ్రెస్ కి ఇప్ప‌టి నుంచే టెన్ష‌న్ పెంచొచ్చు అనుకుంటున్నార‌ట‌! పైగా, లోక‌ల్ తెరాస కేడ‌ర్ లో కూడా కొత్త జోష్ వ‌స్తుంద‌నీ, కేసీఆర్ త‌మ జిల్లా నుంచే పోటీ చేయ‌డం అనేస‌రికి కార్య‌క‌ర్త‌ల ప‌నితీరు వేరేలా ఉంటుంద‌ని ఆశిస్తున్న‌ట్టు అర్థ‌మౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close