రివ్యూ : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Aa Ammayi Gurinchi Meeku Cheppali Review

తెలుగు360 రేటింగ్ : 2.25/5

దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని సంపాయించుకున్నారు మోహనకృష్ణ ఇంద్రగంటి. సున్నితమైన హాస్యం, ప్రేమ, భావోద్వేగాల కలబోత ఇంద్రగంటి సినిమాలు. కమర్షియల్ లెక్కలు, స్టార్ ఇమేజ్ కాకుండా కథని బలంగా నమ్మి ప్రయాణం చేస్తున్న దర్శకుడాయన. సుధీర్ బాబు హీరోగా సమ్మోహనం లాంటి డీసెంట్ సినిమా అందించిన ఇంద్రగంటి.. మధ్యలో ‘వి’ అనే యాక్షన్ థ్రిల్లర్ ని చేశారు. అయితే అది ఓటీటీకి పరిమితమైయింది. ఇప్పుడు మళ్ళీ తన కంఫర్ట్‌ జోన్‌ కి వచ్చి సుధీర్ బాబు కథానాయకుడిగా చేసిన సినిమా ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. సమ్మోహనం కోసం ఎంచుకున్న సినిమా నేపధ్యాన్నే ఈ సినిమా కోసం ఎంచుకున్నారు. ఇంద్రగంటి, మ‌రి.. ఈ ఫార్ములా వ‌ర్క‌వుట్ అయ్యిందా? కాంబినేష‌న్ హిట్టు అందించిందా..?

వరుసగా ఆరు కమర్షియల్ విజయాలు ఇచ్చిన దర్శకుడు నవీన్ (సుధీర్ బాబు). తన సినిమాలన్నీ లాజిక్కి దూరంగా ఉన్నా, బాక్సాఫీసు ద‌గ్గ‌ర‌ మ్యాజిక్ చేస్తుంటాయి. తన కొత్త సినిమాగా ఒక యువరాణి లాంటి పాత్ర చుట్టూ తిరిగే కథ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇదే సమయంలో నవీన్ కి ఒక ఫిల్మ్ రీలు దొరుకుతుంది. ఆ ఫిల్మ్ రీల్ లో నవీన్ కోరుకునే లక్షణాలు వున్న అమ్మాయి కనిపిస్తుంది. తను తీయబోయే కథకు ఆ అమ్మాయే కరెక్ట్ అని ఫిక్స్ అవుతాడు. ఆ అమ్మాయి కోసం అన్వేషించగా.. ఆ అమ్మాయి పేరు అలేఖ్య (కృతిశెట్టి ) అని తెలుస్తుంది. వృత్తి రిత్యా అలేఖ్య డాక్టర్. సినిమాలంటే అలేఖ్యకి చిరాకు. అలేఖ్య కుటుంబం కూడా అంతే. అసలు సినిమా అనే పేరు వినడానికే ఇష్టపడరు. సినిమా వాళ్ళకి అసలు క్యారెక్టర్ వుండ‌ద‌ని వాళ్ళ అభిప్రాయం. అలా అభిప్రాయ పడటానికి ఒక బలమైన కారణం వుంటుంది. ఆ కారణం చాలా విషాదంతో కూడుకున్నది. ఇంతకీ అలేఖ్య కుటుంబానికి సినిమా అంటే ఎందుకు ప‌డ‌దు ? అలేఖ్యని కెమెరా ముందుకు తీసుకురావడానికి నవీన్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? చివరికి తను అనుకున్న సినిమా తీశాడా లేదా ? అనేది మిగతా కథ.

సమ్మోహనం సినిమాలో ఒక మ్యాజిక్ జరిగింది. హీరోయిన్ తో ఒక సామాన్యుడు లవ్ లో ప‌డ‌డం… ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి క‌లిగించే విష‌య‌మే. దాన్ని చాలా సహజంగా ఆహ్లాదంగా చూపించడంలో ఇంద్రగంటి విజయం సాధించారు. స‌ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కథ కోసం కూడా మళ్ళీ సినిమా నేపధ్యాన్నే ఎంచుకున్నాడు. అయితే ఇందులో సమ్మోహనం మ్యాజిక్ మాత్రం రిపీట్ కాలేదు. ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనుకోవడానికి ఎమోషనల్ కథే. కానీ ఆ ఎమోషన్ స్క్రీన్ మీదకి రాలేదు. దీంతో ప్రేక్షకుడు తెరపై జరుగుతున్న సన్నివేశాలని ఏదో తంతులా భావించడం తప్పితే అందులో ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ ఫీలవ్వడు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. అనే టైటిల్‌లోనే చెబితే, క‌చ్చితంగా ఆ అమ్మాయి స‌మ్ థింగ్ స్పెష‌ల్ అని అనిపిస్తుంది. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాల్సిన విష‌యం ఏదో ఉంద‌ని అనిపిస్తుంది. కానీ టైటిల్ లో ఉన్న ఉత్సుక‌త క‌థ‌లో కానీ, ఆ అమ్మాయి పాత్ర‌లో గానీ లేదు.

ప్రేక్షకుడి ఊహకి చాలా సులువుగా అందిపోయే కథ ఇది. అలేఖ్య రీల్ నవీన్ కి దొరికినప్పుడే ఇంటర్వెల్ ఏంటో తెలిసిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే మూడో సన్నివేశంలోనే క్లైమాక్స్ అర్ధమైపొతుంది. ఇలాంటి కథకు ట్రీట్మెంట్ బాగుంది. కానీ దర్శకుడు ఆ దిశగా అలోచించలేదు. పేజీల కొద్దీ డైలాగులు రాసి నటీనటులతో నిదానంగా అప్పగించుకుంటూపోయాడు. ప్రధమార్ధమంతా ఇంటర్వెల్ కోసం వెయిట్ వేచిచూస్తుంటుంది. రీలు గురించి ఆ అమ్మాయికి చెప్పేవచ్చు కదా అని వెన్నెల కిషోర్ పాత్ర అంటే.. నాకు డ్రామా కావాలని అంటాడు సుధీర్ బాబు. ఎప్పుడైనా డ్రామా సహజంగా క్రియేట్ అయితేనే పండుతుంది. కానీ కావాలని బలవంతంగా డ్రామా చేయడం ఉత్తమ సినిమా విధానం కాదనే సంగతి ఈ సినిమాతో మరోసారి రుజువైయింది.

విరామం కోసం రాసుకున్న ట్విస్ట్ ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచినప్పటికీ ఆ ట్విస్ట్ తర్వాత వచ్చే డ్రామా కాస్త డిప్రెసీవ్ గా వుంటుంది. దర్శకుడు అనుకున్న ప్రధాన అంశం ఇదే. తమ పరువు కోసం కూతురు కలలని కాదనే తల్లితండ్రులు. తన కలని ఎలాగైనా నెరవేర్చుకోవాలని తాపత్రయపడే కూతురు. ఇంతవరకూ బావుంది. అయితే ఈ పాయింట్ ని ప్రజంట్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకోదు. తల్లితండ్రులు కాదనడంతో కూతురు ఇంటి నుంచి చాలా సింపుల్ గా వెళ్లిపోతుంది. తర్వాత కథ వేరేలా మలుపు తీసుకుంటుంది. ఈ మాత్రానికి తల్లితండ్రులని నిందించడం, అదే పాయింట్ పై సెకెండ్ హాఫ్ రన్ చేయడం అతకలేదు సరికదా .. ఆ ఫ్యామిలీ డ్రామా కాస్త డైలీ సీరియల్స్ లో ఎమోషనల్ సీన్స్ లా మారిపోయింది. ఇటు అలేఖ్య -నవీన్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ కాలేదు, అటు ఫ్యామిలీ డ్రామా కూడా కుదరలేదు. సినిమాలే ముఖ్యం.. నాకు సినిమాలే జీవితం అనుకున్న పాత్ర ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌గానే పెళ్లి చేసుకుంటుంది. ఇక త‌న ఆశ‌యంలో.. సీరియెస్ నెస్ ని ప్రేక్ష‌కుడు ఎలా ఫీల‌వుతాడు?

ఇంద్రగంటి కథలు, పాత్రలు సెన్సిబుల్ గా వుంటాయి. కానీ ఆయన సెన్సిబిలీటీస్ ఇందులో కనిపించలేదు. ప్రధాన పాత్రలని కూడా సరిగా తీర్చిదిద్దలేదనిపిస్తుంది. పక్కా కమర్షియల్ దర్శకుడైన నవీన్ ..ఒక్కసారిగా శ్యామ్ బెనగల్ లాంటి సినిమా ఎందుకు తీయాలని అనుకుంటాడో అర్ధం కాదు. తల్లితండ్రులు కూతురు మధ్య వున్న బాండింగ్ ని కూడా సరిగ్గా ప్రజంట్ చేయలేదు. చివర్లో తన కూతురు సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాడు తండ్రి.అది చూస్తే ప్రేక్షకుడి కూడా కన్నీళ్లు రావాలి. కానీ రాలేదు. కారణం.. ఆ కూతురుని కోల్పోయిన బాధ .. ఆ తల్లితండ్రుల్లో ఒక్క సన్నివేశంలో కూడా లేదు. ఇలాంటి ఎమోషన్ ని ప్రేక్షకుడు ఫీలయ్యే అవకాశం లేదు. ఇంద్రగంటి ట్రీట్మెంట్ లోని మరో లోపం కథని మాటల్లో చెప్పాలనుకోవడం. సినిమా అనేది విజువల్ మీడియం. కథని చూపించడానికే మొగ్గుచూపాలి. కానీ ఇందులో మాత్రం పేజీల కొద్ది డైలాగులు రేడియో జాకీలా వినిపించారు. అలేఖ్యని నటించమని ఒప్పించడానికి సుధీర్ బాబు చెప్పే ఒక కథ కనీసం మూడు పేజీలు వుంటుంది. ఆ కథ సరిగ్గా వినడానికి చేతిలో రిమోట్ వుంటే బావుండనే ఫీలింగ్ వస్తుంది. థియేటర్ సినిమా లెక్కలు మారిపోయిన ఈ రోజుల్లో ఇంత సుధీర్గమైన ఉపన్యాసాలు ప్రమాదకరం.

సుధీర్‌బాబు సెన్సిబుల్ నటుడు. తన పాత్రని సెటిల్‌గా చేశాడు. భావోద్వేగాలు చక్కగా పలికాయి. కృతిశెట్టి అందంగా వుంది. ఇందులో ఆమెదే టైటిల్ రోల్.రెండు విభిన్న కోణాల్లో కనిపించే అవకాశం వచ్చింది. అయితే దర్శకుడు ఇంద్రగంటి ఆ పాత్రని ఒకటే మూడ్ లో డిజైన్ చేయడం వలన ఎక్కువ వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కలేదు. వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ సుధీర్ బాబు పక్కన వుండే పాత్రలు. ఆ పాత్రలతో ఫన్ పండే అవకాశం వున్నా దర్శకుడు ఆ ఛాన్స్ తీసుకోలేదు. అవసరాల శ్రీనివాస్ ఎంట్రీతో ఒక చిన్న డ్రామా పండింది. శ్రీకాంత్ అయ్యంగర్ పాత్రని ఓవర్ గా డ్రామటైజ్ చేసిన భావన కలుగుతుంది. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

సాంకేతికంగా సినిమా డీసెంట్ గా వుంది. పీజీ విందా కెమెరాపనితనం రిచ్ గా వుంది. ఫ్రేమ్స్ దాదాపు కలర్ ఫుల్ గా వున్నాయి. వివేక్ సాగర్ నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఐతే సమ్మోహనంలో ఇప్పటికీ పాడుకునే పాటలు వున్నాయి. కానీ ఇందులో అలాంటి మ్యూజికల్ మ్యాజిక్ జరగలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి. ఇంద్రగంటి రచనలో మెరుపులు లేవు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఈ టైటిల్ చదవడానికే ఓపిక కావాలి. ఇక సినిమా మొత్తం చూడాలంటే చాలా.. చాలా.. చాలా..ఓపిక కావాలి.

ఫినిషింగ్ ట‌చ్‌: అమ్మాయి ముంచేసింది

తెలుగు360 రేటింగ్ : 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close