తెలంగాణలో టీడీపీని బూచిగా చూపిస్తున్న టీఆర్ఎస్‌..! కారణమేంటి..?

తెలంగాణ రాజకీయ స్వరూపంలో ఇప్పుడిప్పుడే మౌలికమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ.. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా వ్యవహారం నడిచేది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎటాక్‌ను తెలుగుదేశం పార్టీపైకి.. ఆ పేరుతో.. ఆంధ్రప్రదేశ్‌ వైపు మళ్లిస్తోంది. ఎప్పుడైతే.. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం విషయంలో ప్రత్యేకహోదా ఇష్యూ హైలెట్ అయిందో.. అప్పుటి నుంచి ఈ ధోరణి కనిపిస్తోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు రెండు రోజుల ముందు వరకూ.. ఏపీ ప్రత్యేకహోదా డిమాండ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్‌ హఠాత్తుగా యూటర్న్ తీసుకుంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే..తెలంగాణకూ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం ప్రారంభించారు.

లోక్‌సభలో… విభజన అశాస్త్రీయంగా జరిగిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగిస్తే.. టీఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అవే మాటలు ప్రధానమంత్రి అంటే సైలెంట్‌గా ఉండిపోయారు. అది వేరే విషయం. ఇప్పుడు తెలంగాణలో ఆ ప్రత్యేకహోదా కేంద్రంగానే రాజకీయాలు ఓ రేంజ్‌లో చేస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో.. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని తీర్మానం చేయడాన్ని టీఆర్ఎస్ తెలంగాణలో భూతద్దంలో చూపిస్తోంది. తెలంగాణ పరిశ్రమలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ పట్టుకుపోయి.. ఆంధ్రాలో పెట్టబోతోందన్నట్లుగా హరీష్ చెప్పుకొస్తున్నారు. అదే ప్రత్యేకహోదా డిమాండ్‌కు .. టీఆర్ఎస్ గతంలో మద్దతు ప్రకటించిన విషయాన్ని హరీష్ రావు పూర్తిగా మార్చిపోయారు. ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టుల అంశాన్నీ కూడా తెరపైకి తీసుకు వచ్చారు. ఇంత కాలం కోర్టులో కేసులు వేసి.. ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటోందని చెప్పిన.. టీఆర్ఎస్‌ ఇప్పుడు.. ఆ దాడిని టీడీపీపైకి ముఖ్యంగా చంద్రబాబుపైకి మళ్లించింది. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

టీఆర్ఎస్ ఇలా ఏకపక్షంగా చంద్రబాబుపై దాడి చేసి.. టీడీపీని బూచిగా చూపించడానికి బలమైన కారణమే ఉందన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఎలాగైనా..టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా ప్రారంభమయినట్లు తెలుస్తోంది. అందుకే హరీష్ రావు.. తెలంగాణ సెంటిమెంట్‌ను రేపి.. మళ్లీ టీడీపీని ఆంధ్రా పార్టీగా ముద్ర వేసి.. అలాంటి పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటోందని ఆరోపణలు చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన కార్యాచరణలో భాగంగానే టీఆర్ఎస్ విమర్శలన్న అభిప్రాయం.. తెలంగాణ అంతటా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close