కథానాయకుడు అల్లరి నరేష్ ఇంట్లో అల్లరి మొదలైంది. ఎందుకంటే.. నరేష్ నాన్నయ్యాడు. ఆయనకు అమ్మాయి పుట్టింది. 2015లో విరూపతో నరేష్ వివాహమైంది. ఈరోజు విరూప డెలివరీ జరిగింది. పండండి అమ్మాయి పుట్టింది. దాంతో.. నరేష్‌కి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. నాన్నయిన ఆనందంలో నరేష్ ఉబ్బితబ్బుబ్బి అవుతున్నాడు. కెరీర్ పరంగా చూస్తే నరేష్ ప్రస్తుతం డౌన్ ఫాల్లో ఉన్నాడు. వరుసగా పరాజయాలు వెక్కిరిస్తున్నాయి. అమ్మాయి పుట్టింది కదా? అదృష్టం మారుతుందేమో చూడాలి. నరేష్ నటిస్తున్న ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ త్వరలో విడుదల కానుంది. ఈలోగా మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాడు నరేష్. నాన్నగా ప్రమోషన్ పొందిన అల్లరోడికి తెలుగు 360 శుభాకాంక్షలు తెలుపుతోంది. కంగ్రాట్స్ నరేష్..!!