బోయ‌పాటి ధాటికి భ‌య‌ప‌డుతున్న బ‌న్నీ

నెగిటీవ్ టాక్ వ‌చ్చినా వ‌సూళ్ల ప‌రంగా స‌రైనోడు బ‌న్నీకి మంచి ప‌లితాన్ని అందించిన‌ట్టే. నిజానికి ఈ డివైడ్ టాక్‌కి మ‌రో సినిమా అయితే మూడో రోజునే దుకాణం స‌ర్దేయాలి. కానీ.. సోమ‌వారం నుంచి కూడా వ‌సూళ్లు స్ట‌డీగా ఉన్నాయ‌న్న టాక్స్ రావ‌డం.. సరైనోడుకి ప్ల‌స్‌గామారింది. సాధార‌ణంగా ఓ సినిమా చేశాక‌.. మ‌ళ్లీ అదే ద‌ర్శ‌కుడితో క‌ల‌సి చేయ‌డానికి హీరోలు స‌ముఖంగా ఉంటారు. ‘బ‌న్నీతో మ‌రో సినిమా చేయ‌డానికి నేను రెడీ’ అంటూ బోయ‌పాటి ఇప్ప‌టికే మ‌న‌సులో మాట బ‌య‌పెట్టాడు. స‌రైనోడుకి సీక్వెల్ కూడా ఉండ‌బోతోంద‌ని టాలీవుడ్‌లో టాక్స్ వినిపిస్తున్నాయి.

అయితే… బ‌న్నీ మాత్రం ”ఇప్ప‌ట్లో బోయ‌పాటితో సినిమానా, నా వ‌ల్ల కాదు.. ఇది చాలు” అంటున్నాడ‌ట‌. బోయ‌పాటి త‌న హీరోల్ని బాగా క‌ష్ట‌పెడ‌తాడు. అయితే అవుట్ పుట్ అలానే లాక్కొంటాడు. బోయ‌పాటి స్టైల్ ఆఫ్ డైరెక్ష‌న్ వేరే లెవిల్ లో ఉంటుంద‌ని ఆయ‌న‌తో ప‌నిచేసే హీరోలే చెప్తుంటారు. స‌రైనోడు కోసం బ‌న్నీ బాగా న‌లిగిపోయిన‌ట్టున్నాడు. అందుకే.. బోయ‌పాటికి కొన్నాళ్లు దూరంగా ఉండాల‌ని డిసైడ్ అయ్యాడేమో. ఇంత మాస్ మ‌సాలా సినిమా చేశాక‌.. బ‌న్నీ ల‌వ్‌, ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ల వైపు దృష్టి మ‌ర‌ల్చ‌డం స‌హ‌జం. అందుకే.. బోయపాటి మార్క్ సినిమాలు వ‌ద్దు.. అనుకొంటున్నాడేమో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close