డీజే క్లైమాక్స్‌… ర‌చ్చః, ర‌చ్చ‌స్య‌, ర‌చ్చోభ్యః

దిల్‌రాజు కి మాస్ ప‌ల్స్ బాగా తెలుసు. ఆడియ‌న్స్ మైండ్ సెట్ ని అర్థం చేసుకొన్న ప్రొడ్యూస‌ర్ ఆయ‌న‌. క‌థ‌, స్క్రీన్ ప్లే, క్యారెక్ట‌రైజేష‌న్స్‌ల‌లో దిల్‌రాజు ఇన్‌వాల్వ్‌మెంట్ చాలా ఉంటుంది. డీజే విష‌యంలో కూడా దిల్‌రాజు స‌ల‌హాలూ, సూచ‌న‌లు బాగా ఉప‌యోగిపడిన‌ట్టు టాక్‌. మ‌రీ ముఖ్యంగా క్లైమాక్స్ ఎలా ఉండాల‌న్న‌ది దిల్‌రాజే డిసైడ్ చేశాడ‌ట‌. నిజానికి ఈ సినిమా కోసం హెవీ క్లైమాక్స్ డిజైన్ చేసినా, దాన్ని దిల్ రాజు సూచ‌న‌ల‌తో హిలేరియ‌స్ గా మార్చేశాడు హ‌రీష్ శంక‌ర్‌. డీజే క్లైమాక్స్‌లో ఫైట్ లేదు. జ‌స్ట్‌.. ఎంట‌ర్‌టైన్ చేసి, జ‌నాల్ని ఇంటికి పంపిస్తారంతే. ఎందుకంటే ప్రీ క్లైమాక్స్‌లో ఓ భారీ ఫైట్ ఉంద‌ట‌. వెంట వెంట‌నే రెండు ఫైట్స్ అనేస‌రికి ఆడియ‌న్ బోర్ ఫీల‌వుతాడ‌న్న‌ది దిల్‌రాజు లాజిక్‌. దాంతో పాటు యాక్ష‌న్ సీక్వెన్స్ కంటే.. కామెడీ బిట్టే త‌క్కువ‌లో కానిచ్చేయొచ్చు. అలా దిల్‌రాజుకి బ‌డ్జెట్ ప‌రంగానూ క‌లిసొస్తుంది. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాకి దిల్‌రాజు పాటించిన సూత్రం ఇదే. యాక్ష‌న్ సీన్‌తో ఆ సినిమాకి ఎండ్ కార్డ్ ప‌డుతుంద‌నుకొంటే.. ఫ‌న్నీ సీన్‌తో శుభం కార్డు వేశారు. ఆ ఆలోచ‌న కూడా దిల్‌రాజుదే. డీజేలో క్లైమాక్స్ హిలేరియ‌స్ గా పండింద‌ని, అప్ప‌టి వ‌ర‌కూ సినిమా ఎలాగున్నా – క్లైమాక్స్‌కి వ‌చ్చేస‌రికి ప్రేక్ష‌కుడు రిలీఫ్ ఫీల‌వుతాడ‌ని, చిరున‌వ్వుల‌తో థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాడ‌ని, డీజే అవుట్ పుట్ తెలిసిన‌వాళ్లు చెబుతున్నారు. అదే జ‌రిగితే దిల్ రాజు ప్లాన్ వ‌ర్క‌వుట్ అయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.