అల్లు శిరీష్ జ‌గ‌దేక వీరుడా??

కొత్త జంట త‌ర‌వాత సినిమా మొద‌లెట్ట‌డానికి బాగా టైమ్ తీసుకొన్నాడు అల్లు శిరీష్‌. అయితే అంత గ్యాప్ భ‌విష్య‌త్తులో రాకూడ‌ద‌ని గ‌ట్టిగా ఫిక్స‌యిన‌ట్టున్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. శ్రీ‌ర‌స్తు – శుభ‌మ‌స్తు షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే మ‌రో రెండు సినిమాల్ని ప‌ట్టాలెక్కించాడు. అందులో ఓ చిత్రానికి ఎంవీఎన్ రెడ్డి ద‌ర్శ‌కుడు. శైలేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ‌తో ఆక‌ట్టుకొన్న మెహ‌రీన్ క‌థానాయిక‌. ఇదో చారిత్ర‌క నేథ‌ప్య‌మున్న ప్రేమ‌క‌థ‌. మ‌గ‌ధీర‌లా గ‌త‌జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగుతుంద‌ట‌. ఈ చిత్రానికి ‘జ‌గ‌దేక‌వీరుడి క‌థ‌’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు టాక్‌. అంటే.. సినిమా కాస్త జాన‌ప‌ద టైపులో సాగుతుంద‌న్న‌మాట‌. టైటిల్ బాగానే ఉంది గానీ… అల్లు వారి అబ్బాయి జ‌గ‌దేక వీరుడులా పోజు కొడుతూ కాంతారావు టైపులో క‌త్తియుద్దాలు చేస్తేనే కాస్త కామెడీగా ఉంటుంద‌ని అప్పుడే సెటైర్లు వేసుకొంటున్నారు సినీ జ‌నాలు. శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు విడుద‌ల త‌ర‌వాత‌…. త‌న దృష్టిని ఈ సినిమాపైనే కేంద్రీక‌రించ‌నున్నాడు శిరీష్‌. ఈ యేడాది చివ‌రిక‌ల్లా షూటింగ్ కూడా పూర్త‌వుతుందట‌. 2017 ప్ర‌ధ‌మార్థంలో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close