పునాదుల్ని కూడా పెకిలించేస్తున్నారు..! ఎంత కసో..!?

అమరావతిపై ప్రభుత్వ పెద్దలకు ఎంత కసి ఉందో మరోసారి నిరూపితమయింది. అమరావతికి అనుసంధానం చేసే ఐకానిక్ వంతెన నిర్మాణం కోసం గతంలో ప్రారంభమైన పనులు జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఆగిపోయాయి. మందుకు తీసుకెళ్లడంలేదు. కానీ.. ఇప్పుడు కొత్తగా నిర్మాణం అయిన వాటిని కూల్చేయడం ప్రారంభించారు. వంతెన కోసం అత్యంత గట్టిగా… పిల్లర్లు నియమించారు. ఆ పిల్లర్లను భూమిలోపల నుంచి తొలగించే పనులు ప్రారంభించారు. అంత అవసరం ఏమిటో రాజధాని రైతులకే కాదు… ఆ వంతెన వల్ల… రాకపోకలు మెరుగ్గా మారతాయని.. విజయవాడ సిటీపై ట్రాఫిక్ భారం తగ్గుతుందని అనుకున్న వారికి కూడా డౌట్ వచ్చింది.కానీ సమాధానం చెప్పేవారు లేరు.

అమరావతిని అనుసంధానించేందుకు.. కృష్ణానది పై పవిత్ర సంగమం వద్ద నుంచి రాజధానిని కలిపే ఐకానిక్ బ్రిడ్జి పనులను గతంలో ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం నుంచి లింగాయపాలెం వరకూ ఈ ఐకానిక్ వంతెన ఉంటుంది. ఆరు లైన్ల తో 3.20 కిలోమీటర్ల మేర ఈ వంతెన ఉంటుంది. కేబుల్ పోర్షన్ అరకిలోమీటర్ ఉండేలా డిజైన్ చేశారు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారితో పాటు, కోల్‌కతా, చెన్నై జాతీయ రహదారి నుంచి వచ్చే వాహనాలు, ప్రయాణికులు ఈ ఐకానిక్ బ్రిడ్జిపై నుంచి నేరుగా రాజధానికి అమరావతికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో విజయవాడ నగరంలోకి వాహనాల ప్రవేశం పూర్తిగా తగ్గించవచ్చు.

గత ప్రభుత్వ హయాంలోనే ఎల్ అండ్ టీ సంస్థ పనులు ప్రారంభించింది. కృష్ణానదిలో సాయిల్ టెస్టింగ్ ను ఇ పూర్తి చేసి రెండు మీటర్ల డయాతో ఐకానిక్ పోర్షన్ కు సంబంధించిన ఫైల్ ఫౌండేషన్ ను వేశారు. కొత్త ప్రభుత్వం రాగానే ఆ పనులన్నింటినీ నిలిపివేయించింది. ఇప్పుడు కాంట్రాక్ట్ ను రద్దు చేసినందున… భూమి కూడా అప్పగించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థపై ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఆ ఫౌండేషన్‌ను ఎవరు కూలగొడుతున్నారో… స్పష్టత లేదు. ప్రభుత్వం చేయిస్తుందా..లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఒక వేళ ప్రభుత్వం చెప్పకపోతే.. కూలగొట్టినందుకు.. వారిపై కేసులు పెట్టాలి. కానీ అలాంటి చర్యలు అధికారుల వైపు నుంచి లేవు కాబట్టి. .. ప్రభుత్వ ప్రొద్భలంతోనే ఈ విధ్వంసం ప్రారంభమైందని అనుకోవాలి. కట్టకపోతే కట్టకపోయారు.. అసలు అవేమి అడ్డం వచ్చాయని కూలగొట్టారని సామాన్య జనానికి వస్తున్న సందేహం. దాన్ని తీర్చేవారెవరు ఉంటారు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close