దేవిశ్రీ జడ్జ్‌మెంట్…చిరు సినిమాపైన డౌట్స్

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టెక్నీషియన్ హవా నడుస్తూ ఉంటుంది. టాప్ గ్రేడ్ హీరోలందరూ కూడా ఆ టెక్నీషియన్‌తోనే వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆ టాప్ టెక్నీషియన్ కూడా లైం లైట్‌లో ఉన్నప్పుడే కాస్త ఎక్కువ క్యాష్ చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో తన దగ్గరకు వచ్చిన సినిమాలన్నింటినీ కూడా ఒప్పుకుంటూ ఉంటాడు. కానీ ఆ టెక్నీషియన్ చేసే వర్క్ విషయంలో మాత్రం సినిమా సినిమాకు చాలా వేరియేషన్ ఉంటుంది. ఎన్నో సినిమాలకు వర్క్ చేసిన అనుభవంతో ఏ సినిమా హిట్టవుతుంది? ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న అంచనా ముందే వచ్చేస్తుంది. అందుకే చాలా మంది టాప్ రేంజ్ హీరోలు, ప్రొడ్యూసర్స్ కూడా ముందుగా ఆ టాప్ గ్రేడ్ టెక్నీషియన్స్‌కి కూడా కథలు వినిపిస్తూ ఉంటారు. అతని జడ్జ్‌మెంట్‌కి కూడా చాలా విలువ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నంబర్ ఒన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే స్థాయిలో ఉన్న దేవిశ్రీ ప్రసాద్ కూడా ఆ పొజిషన్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఒక్కో సినిమాకు ఒక్కోలా ఉంటుంది. ముఖ్యంగా దేవిశ్రీ కంపోజ్ చేసిన మ్యూజిక్ క్వాలిటీని బట్టి సినిమా రిజల్ట్‌ని డిసైడ్ చేసెయ్యొచ్చు అనేలా దేవిశ్రీ ఇచ్చే అవుట్ పుట్‌లో వేరియేషన్ ఉంటుంది.

రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఢమరుకం, గబ్బర్‌సింగ్ సినిమాలకు ఒకేసారి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఆ రెండు సినిమాలలో ఉన్న పాటలను ఒకేసారి విన్నవాళ్ళకు ఎవరికైనా రెండు సినిమాలకూ మ్యూజిక్ కంపోజ్ చేసింది ఒకరేనా అన్న సందేహం వస్తుంది. ఇక ఈ మధ్య కాలంలోనే బాహుబలి స్థాయి మూవీ అంటూ మనముందుకు వచ్చిన తమిళ ‘పులి’కి మనవాడు ఇచ్చిన మ్యూజిక్ ఏ రేంజ్‌లో ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఊసరవెల్లి-నాన్నకు ప్రేమతో, శివం-నేను శైలజ..ఇలా ఒకే హీరో సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు కూడా ఆ సినిమా హిట్టవుతుందా? పోతుందా? అన్న క్లారిటీతోనే మ్యూజిక్ ఇచ్చేవాడు దేవిశ్రీ. ఇప్పుడు ‘ఖైదీ నంబర్ 150’ సినిమా టీజర్‌కి దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన కాపీ మ్యూజిక్, అలాగే తాజాగా రిలీజ్ చేసిన ‘అమ్మడూ..లెట్స్ డూ కుమ్ముడు’ సాంగ్‌ని విన్నవాళ్ళకు అయితే దేవికి సినిమాపైన ఎంత నమ్మకం ఉంది అనే విషయం తెలిసిపోతోంది. చిరంజీవి 150వ సినిమా, ప్రిస్టేజియస్ మూవీ అని మనవాడు మాటలు మాత్రం ఓ స్థాయిలో చెప్పేస్తున్నాడు కానీ వర్క్ విషయంలో మాత్రం దేవిశ్రీ ప్రసాద్ స్థాయికి తగ్గట్టుగా కాకపోయినా కనీసం ప్రేక్షకులకు ఎంతో కొంత నచ్చేలా కూడా ఇవ్వడం లేదు. ఆల్రెడీ కంపోజ్ చేసిన ట్యూన్స్‌నో, లేకపోతే కాపీ కంటెంట్‌నో చిరంజీవి సినిమా కోసం వాడేస్తున్నట్టుగా ఉంది వ్యవహారం. ఇప్పటికైతే రిలీజ్ చేసిన టీజర్, ఫస్ట్ సాంగ్‌తో మెగా ఫ్యాన్స్‌ని కూడా డిసప్పాయింట్ చేశాడు దేవి. ఇక ముందు రాబోయే సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close