ప్రత్యారోపణలు కాదు హరీష్…! చంద్రబాబు విమర్శలకు కౌంటర్ ఇవ్వాలి..!

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై… టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎదురుదాడి ప్రారంభించారు. చంద్రబాబు… ఖమ్మంతో పాటు.. హైదరాబాద్ లో.. రాహుల్ తో కలిసి సభలు, సమావేశాలు, రోడ్ షోల్లో పాల్గొని.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తనపై చేస్తున్న విమర్శలకు..ఎక్కడికక్కడ సమాధానాలిచ్చారు. ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారని.. కేసీఆర్ చేసిన విమర్శలకు… కూడా.. ఆన్సర్ ఇచ్చారు. ఎగువ రాష్ట్రానికి నీళ్లు రాకుండా.. దిగువ రాష్ట్రం ఎలా అడ్డుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి వివాదాలేమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకుందామన్నారు. ఇక ప్రతి పనికి… తాను అడ్డు పడుతున్నట్లుగా కేసీఆర్ చేస్తున్న ఆరోపణలనూ…. తనదైన శైలిలో తిప్పి కొట్టారు. దళిత సీఎం దగ్గర్నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్ల వరకూ … అన్నీ హామీలు కేసీఆర్ అమలు చేస్తానంటే తాను అడ్డు పడ్డానా అని ప్రశ్నించారు.

చంద్రబాబు విమర్శలు….విమర్శలకు సమాధానాలు… టీఆర్ఎస్ నేతలకు సూటిగానే తగిలినట్లు ఉన్నాయి. చంద్రబాబుపై మాట కంటే ముందుగా… ఎదురుదాడికి సిద్ధంగా ఉండే… హరీష్ రావు… ఈ సారి.. కాంగ్రెస్, టీడీపీ మ్యానిఫెస్టోల్ని పట్టుకుని మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు ఏపీలో హామీల్ని అమలు చేయలేదని… రకరకాల హామీల్ని ఏకరవు పెట్టారు. ఆరు వందల హామీల్ని ఇచ్చినా చంద్రబాబు అమలు చేయలేదని… చెప్పుకొచ్చారు. అయినా.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో.. చంద్రబాబును బూచిగా చూపిస్తూ.. కేసీఆర్ చేస్తున్న ప్రచారాన్ని చంద్రబాబు తిప్పికొట్టాలి. దానికి కౌంటర్ ఇవ్వాలి కానీ.. మీరు కూడా ఏపీలో ఏమీ హామీల్ని అమలు చేయలేదని… ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం… కచ్చితంగా పలయనవాదమేనని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు

చంద్రబాబు .. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించారని.. ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారని హరీష్ రావు ఆరోపించారు… అయితే.. అసలు ఎమ్మెల్యేలను కొన్నది.. వారికి మళ్లీ టిక్కెట్లు ఇచ్చి నిలబెట్టింది ఎవరో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది కదా.। కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ నేతల్నికూడా.. బామాలి.. బెదిరించి… గులాబీ కుండువా కప్పుకునేలా చేయడంలో హరీష్ రావుదే కీలక పాత్ర. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండకూడదన్న ఏకకై లక్ష్యంతో.. అధికార యంత్రాంగం మొత్తాన్ని దుర్వినియోగం చేసి .. రాజకీయం చేసిన చరిత్ర హరీష్ రావుదని.. టీడీపీ నేతలు అంటున్నారు. అంతా కేసీఆర్ చేసి… మళ్లీ రివర్స్ లో టీడీపీపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అసలు… టీడీపీకి తెలంగాణలో అర శాతం.. ఒక శాతం ఓట్లు ఉంటాయని.. కుండబద్దలు కొట్టి చెప్పిన టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. బహుశా దీనికి ఎన్నికల తరవాత సమాధానం చెబుతారేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close