ఎన్నికల కోడ్ వస్తే ఆ రంగులకు రంగు పడాల్సిందే..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం “రంగుల మిషన్” ప్రారంభించింది. కొత్తగా కట్టింది ఏమీ లేకపోయినా.. ఉన్న ప్రభుత్వ భవనాలన్నింటికీ.. వైసీపీ రంగులు వేసేస్తున్నారు. స్మశానాలు, సామూహిక మరుగుదొడ్లు సహా.. దేన్ని వదిలి పెట్టడం లేదు. ఇక పంచాయతీ భవనాలను ఎలా వదిలి పెడతారు. ఇప్పుడు వైసీపీ రంగులతో అవన్నీ వైసీపీ పార్టీ కార్యాలయాలుగా కనిపిస్తున్నాయి. ఈ రంగులు వేయడానికి రూ. 1300 కోట్లు ఖర్చు పెడుతున్నారని.. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంత ఖర్చుపెడుతున్నామో ప్రభుత్వం మాత్రం చెప్పడం లేదు కానీ.. చాలా పెద్ద మొత్తమే దీని కోసం వెచ్చిస్తున్నట్లుగా.. ఊరూవాడా కనిపిస్తున్న రంగులే నిరూపిస్తున్నాయి. ఎలా చూసినా.. ఇవన్నీ అధికారిక రంగులు కాదు. కేవలం.. వైసీపీ రంగులు. మరి ఎన్నికల కోడ్ వస్తే.. ఆ రంగులను ఏం చేస్తారు..?

దేశంలో ఎన్నికల కోడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఓటర్లను ప్రభావితం చేసే…ఏ అంశానికి అయినా.. కోడ్ సమయంలో… ముసుగుపడాల్సిందే. అందుకే విగ్రహాలకు ముసుగేస్తారు. శంకుస్థాపన ఫలకాలకూ ముసుగేస్తారు. ఇప్పుడు… వైసీపీ రంగులు ఉన్న ప్రభుత్వ భవనాలు.. పంచాయతీ కార్యాలయాలు కనిపిస్తున్నాయి. వాటినేం చేస్తారనేది.. చాలా మంది వస్తున్న డౌట్. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ బూత్‌లన్నీ.. దాదాపుగా.. పంచాయతీ భవనాల్లోనో.. స్కూళ్లలోనో ఉంటాయి. ఓటింగ్ సమయంలో ఆ భవనాలకు వైసీపీ రంగులు ఉంటే..ఎన్నికల కోడ్‌కు విరుద్ధం. ఒక్క గ్రామ పంచాయతీనే కాదు.. ఎలాంటి ఎన్నికలు జరిగినా.. వైసీపీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు ఉండటం కోడ్ ఉల్లంఘనే. అంటే.. మళ్లీ వాటన్నింటికీ తెల్లరంగు వేయాలి. లేదా.. ముసుగులేయాలి. భవనాలకు ముసుగులేసే టెక్నాలజీ ఇంకా రాలేదు కాబట్టి.. తెల్ల రంగే వేయాలి.
 
ఇప్పుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగుల కోసం రూ. 1300 కోట్లు ఖర్చుపెడితే.. ఎన్నికల కోడ్ రాగానే.. మరో రూ. 1300 కోట్లు ఖర్చుపెట్టి.. వాటికి తెల్ల రంగులేయాలి. ఎన్నికలు అయిపోగానే.. మళ్లీ మరో రూ. 1300 కోట్లు పెట్టి రంగులేసుకోవాలి. మళ్లీ ఎన్నికలు రాగానే… ఈ సైకిల్ ఇలా కొనసాగుతుందన్నమాట. ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని.. మాటలు చెబుతున్న ఏపీ సర్కార్..  తాము చేయని అభివృద్ధి పనులకు.. తమ పార్టీ రంగులేసుకోవడానికి .. ఇలా వందల కోట్లు వెచ్చించడం… సాధారణ ప్రజలను సైతం విస్మయపరచకుండా ఎలా ఉంటుంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close