జనసేన ఉనికి తెలుసుకోలేని సర్వేల్లో శాస్త్రీయత ఎంత..?

టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, న్యూస్ 18 లాంటి పేరు గొప్ప చానళ్లు.. సర్వేలను ప్రకటించాయి. వాటిని నమ్మాలా.. వద్దా.. అన్నది.. ఎవరికి వారు వ్యక్తిగతంగా నిర్ణయించుకుంటారు. అయితే.. సులువుగా అంచనా వేయగలిగే… అతి పెద్ద విషయాలను మాత్రం… తెలుసుకోకుండా.. ఏపీలో జరిగే రాజకీయ పరిణామాలపై ఏ మాత్రం అవగాహన లేకుండా… ఆ సర్వేలు ఉండటమే.. అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

జనసేన గురించి వారెవరికీ ఎందుకు తెలియదు..?

పేరు గొప్ప చానళ్లన్నీ… జనసేన విషయాన్ని పెద్దగా ప్రస్తావించలేదు. అన్నీ ఇతరలకు కొంత శాతం వేసి.. అందులోనే అన్నట్లుగా చెప్పుకొచ్చాయి. కానీ ఏపీలో పరిస్థితి అలా లేదని.. ఎవరికైనా తెలుసు. పవన్ కల్యాణ్.. పార్టీ గెలవలేకపోవచ్చు కానీ.. పది శాతం వరకూ ఓట్లు చీల్చుకుందనేది మాత్రం… అందరూ నమ్మే విషయం. పది శాతం ఓట్లు సాధించే పార్టీ… ఇతరుల ఖాతాల్లో వేసి.. జాతీయ మీడియా ఎలా సర్దుబాటు చేస్తుంది. ఇంకా కామెడీ ఏమిటంటే… న్యూస్ 18 సంస్థ… బీజేపీకి ఏపీలో దాదాపుగా 14 శాతం, కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 8 శాతం ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ ప్రకటించింది. అసలు ఆ రెండింటికి కలిపి.. రెండు శాతం కూడా ఓట్లు రావనేది… సులువుగా అంచనా వేయగిలే విషయం. మరి న్యూస్ 18కి.. ఆ ఇరవై శాతం మంది బీజేపీ, కాంగ్రెస్ ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారో..?

ఇంత పెద్ద విషయం తెలియనప్పుడు.. సర్వే ఎలా చేస్తారు..?

జనసేన ప్రభావాన్ని ఏ మాత్రం అంచనా వేయని సర్వేలు… క్షేత్ర స్థాయిలో .. పని చేశాయని… నమ్మాలంటే.. ఎలా నమ్ముతారు..?. ఆంధ్రప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్ నిర్వహిస్తే.. క్షేత్ర స్థాయిలో.. శాంపిల్స్ తీసుకుని చేయాలి. చేస్తే.. అప్పుడే అసలు విషయం క్లారిటీకి వస్తుంది. కానీ… ఫోన్ల ద్వారానో… ఇతరుల ద్వారానో.. లేకపోతే.. తమ మీడియా ప్రతినిధి ద్వారానో.. కొంత సమాచారం సేకరించి.. దాని ఆధారంగా ఎగ్జిట్ పోల్ ప్రకటిస్తే.. దాని ఫలితాలు ఇలాగే ఉంటాయి. జనసేనకు సీట్లు రాకపోవచ్చు… కానీ ఓటింగ్‌లో.. మాత్రం.. బలంగానే ఉందని.. ఎవరికైనా అర్థమైపోతుంది.

ఫలితాల తర్వాత ఒక్కరైనా బాధ్యత తీసుకుంటారా..?

ఇంగ్లిష్ చానళ్లు కాబట్టి… తాము ఏది చెబితే.. అది కరెక్టని.. జనం అనుకుంటారు. కొంత మంది నమ్ముతారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం.. ఈ ఎగ్జిట్ పోల్స్ కొంత వరకైనా చేయాల్సి ఉంది. కొన్ని ప్రధానమైన పార్టీల ఉనికి అంచనా వేయడమే సాధ్యం కాని సర్వేలతో.. కచ్చితమైన ఫలితాలను సాధిస్తారో.. ఆయా చానళ్లకే తెలియాలి. ఏ మాత్రం.. అంచనాలు వేయలేని… శాస్త్రీయంగా విశ్లేషణ చేయలేని… చానళ్లు.. ఇష్టారాజ్యంగా అంకెలు ప్రకటించి… ఆనక.. కనీసం ఎందుకు తప్పయిందో వివరణ కూడా ఇవ్వవు. ఇలాంటి పరిస్థితుల వల్ల .. డబ్బుతో రాజకీయం చేయాలనుకునేవారి ఆటలు పెరిగిపోతున్నాయి. మీడియా విలువ తగ్గిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com