కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు…

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ల్యాండ్ క‌బ్జా కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న కాన్నారావు దౌర్జ‌న్యాలు ఒక్కోటిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పోలీసు అధికారుల‌తో క‌లిసి క‌న్నారావు చేసిన సెటిల్మెంట్ బాధితులు ఒక్కొక్క‌రుగా ఫిర్యాదు చేస్తున్నారు.

త‌న‌కు న్యాయం చేయాలంటూ విజ‌య వ‌ర్ధ‌న్ రావు అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి క‌న్నారావును ఆశ్ర‌యించారు. త‌న వ‌ద్ద భారీగా బంగారం ఉంద‌ని తెలుసుకున్న క‌న్నారావు బిందు మాధ‌వి అలియాస్ నందిని చౌద‌రి అనే మ‌హిళ‌తో క‌లిసి న్యాయం చేయాల‌ని వ‌చ్చిన వ్య‌క్తికే ఎసరు పెట్టారు. ఓ గెస్ట్ హౌజ్ లో నిర్బంధించి, బెదిరించి ఏకంగా 60ల‌క్ష‌ల న‌గ‌దు, 97 తులాలా బంగారాన్ని లాక్కున్న‌ట్లు బాధితుడు పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు.

క‌న్నారావు, శ్యామ్ ప్ర‌సాద్, నందిని చౌద‌రి క‌లిసి ఇదంతా చేశార‌ని, టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగ రావు, ఏసీపీ కట్టా సాంబయ్య తమకు క్లోజ్ అంటూ వారు బెదిరించార‌ని విజ‌య వ‌ర్ధ‌న్ పేర్కొన్నారు.

దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఐదుగురిపై కేసు న‌మోదు చేశారు. ద‌ర్యాప్తు చేస్తుండ‌గా… ఇలాంటి కేసులు మ‌రిన్నీ న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close