ఏపీలో రక్తి కట్టిస్తున్న మద్యం రాజకీయం

హైదరాబాద్: విజయవాడలో గత సోమవారం ఉదయం కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోయిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కలకలం సృష్టిస్తోంది. ఆ బార్ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుకు చెందిన హోటల్ ఎమ్ యొక్క సెల్లార్‌లో, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని తెలియగానే టీడీపీ నేతలు పండగ చేసుకున్నారు. తప్పంతా కాంగ్రెస్ నేతలదేనని చేతులు దులుపుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లాగా కిమ్మనకుండా ఉండిపోయారు. ఆ బార్ తమ నేతది కాకుండా మరెవరిదయినా గానీ రెచ్చిపోయేవాళ్ళే. కానీ అది తమ సీనియర్ నాయకుడిదే కావటంతో దీనిపై నిన్న పెదవి విప్పిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, టీడీపీ ప్రభుత్వ అక్రమాలను, అవినీతిని బయటపెడుతున్నందునే మల్లాది విష్ణును ఇరికించారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే జగన్ బాబు యధావిధిగా నిన్న బాధితులను ఓదార్చటానికి వెళ్ళినపుడు చేసిన ప్రకటన ఈ మొత్తం వ్యవహారాన్ని రక్తి కట్టించింది. మరి ఆలోచించే అన్నారో, ఆవేశంలో అన్నారో తెలియదుగానీ, రెండేళ్ళలోనో, మూడేళ్ళలోనో ఈ ప్రభుత్వం పోతుందని, తాము అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని ప్రకటించేశారు. చంద్రబాబుకు ఇప్పటికైనా మద్య నిషేధం విధించాలని సూచించారు. ఈ ప్రకటన ప్రత్యర్థి పార్టీల నాయకులనే కాక సొంతపార్టీ నాయకులను కూడా షాక్‌‌కు గురిచేసింది. ఏ రాజకీయ పార్టీలోనైనా మద్యం వ్యాపారులు ఉండటం సహజం. రాజకీయ నాయకులంటేనే సహజంగా మద్యం వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసేవారయి ఉంటారు. అందులోనూ వైసీపీలోని ప్రధాన నాయకుడు బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో లిక్కర్ డాన్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. గతంలో కిరణ్‌‍కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బొత్సను దెబ్బతీయటంకోసం ఏసీబీ దాడులు చేయించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మరో వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావుకు కూడా శ్రీకాకుళం జిల్లాలో మద్యం వ్యాపారాలున్నాయి. మరి మద్యనిషేధానికి జగన్ ఈ ప్రకటన చేసేముందు తన సొంతపార్టీలో మద్యం వ్యాపారం చేసే బొత్స, ధర్మాన వంటి నాయకులతో చర్చించారా, లేదా అన్నది తెలియటంలేదు. ఆ విషయాన్నే టీడీపీ నేతలు పట్టుకున్నారు. ఒకవైపు బొత్స, మరోవైపు ధర్మాన వంటి నాయకులను పెట్టుకుని సంపూర్ణ మద్య నిషేధం విధించాలని అడగటమేమిటని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసలు బెల్ట్ షాపులకు శ్రీకారం చుట్టిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు.

వాస్తవానికి నాణ్యమైన సరకు, ఖచ్చితమైన ఎంఆర్‌పీ రేట్లకే వినియోగదారులకు మద్యం అందించేందుకుగానూ, తమిళనాడు తరహాలో మద్యం దుకాణాలను పూర్తిగా ప్రభుత్వమే నడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టారు. అయితే ప్రైవేట్ మద్యం వ్యాపారుల లాబీ ఒత్తిడితో యూటర్న్ చేసి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. కేవలం 10 శాతం దుకాణాలను మాత్రమే ప్రభుత్వం నడపాలని నిర్ణయించారు. ఈ ప్రభుత్వ దుకాణాలలో మంచి మద్యం ఇస్తున్నారనే పేరు రావటంతో ఆ దుకాణాలకు గిరాకీ పెరిగింది. పక్క రాష్ట్రాలనుంచి పన్నులు చెల్లించకుండా అక్రమంగా తీసుకొచ్చే మద్యాన్ని, డైల్యూట్ చేసిన మద్యాన్ని, ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మే ప్రైవేట్ వ్యాపారులు, ప్రభుత్వ దుకాణాల కారణంగా తాముకూడా మంచి మద్యాన్ని ఎంఆర్‌పీ రేట్లకు అమ్మాల్సి వచ్చింది. దీంతో ప్రైవేట్ మద్యం వ్యాపారులు మళ్ళీ ఒత్తిడి ప్రారంభించారు. దీంతో ఆ 10 శాతం దుకాణాలను కూడా ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటిని వేలం ద్వారా ప్రైవేట్ వ్యాపారులకు కేటాయించాలని చూస్తోంది. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. చంద్రబాబుపై మరో ప్రధాన విమర్శకుడా ఉంది. అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులను మూసేస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు, ప్రమాణ స్వీకారం రోజే ఆ ఫైల్‌పై సంతకం చేశారు… కానీ, ఆ బెల్ట్ షాపులకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చేశారు.

మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీకాంత్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ మద్యం వ్యాపారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ సంపూర్ణ మద్యనిషేధం ప్రకటన నేపథ్యంలో వైసీపీ నేతలు మద్యం వ్యాపారానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇదే కనక జరిగితే అంతకంటే మంచి ఏముంటుంది! పనిలో పనిగా అలా మద్యం వ్యాపారం వదిలేస్తున్న తమ నేతలతో ప్రకటనలు చేయిస్తే అది మిగిలిన పార్టీలకు కూడా ఒక ఆదర్శంగా నిలుస్తుంది… ఆ పార్టీలలో మద్యం వ్యాపారం చేసే నేతలు కూడా చచ్చినట్లు దానిని వదిలేయాల్సివస్తుంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైసీపీ అలాంటి కార్యక్రమం చేపడితే ప్రజలలో ఆదరణను కూడా పెంచుకున్నట్లవుతుంది. ఏది ఏమైనా కల్తీ మద్యం దుర్ఘటన వల్ల మద్యం వ్యాపారాలు చేస్తున్న రాజకీయ నాయకులపై చర్చ మొదలవటం మంచి పరిణామం. దీనివల్లనైనా ఆ వ్యాపారంలో అక్రమాలకు తెరపడుతుందేమోనని ఆశిద్దాం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close