దుబ్బాక వర్సెస్ తిరుపతి..! ఏపీ బీజేపీ ఎక్కడుంది..!?

దుబ్బాకలో బీజేపీ గెలిచిందని.. తాము తిరుపతిలో గెలిచేస్తామని ఏపీ బీజేపీ నేతలు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. ఇక గెలిచేసినట్లుగానే ఊహించుకుని సంబరాలకు సిద్ధమవుతున్నారు. కానీ దుబ్బాకలో బీజేపీ నేతలు పడిన కష్టంలో.. వారి రాజకీయ వ్యూహంలో ఒక్కటంటే ఒక్క శాతం అయినా పడుతున్నారా అంటే.. లేనే లేదని చెప్పుకోవాలి. దుబ్బాకలో బీజేపీ ప్రధానంగా… అధికార పార్టీపై పోరాడింది. సహజంగా ప్రతిపక్షాల పని.. అధికారంలో ఎవరు ఉంటే వారిపై పోరాటం. అలా పోరాడితేనే ప్రత్యామ్నాయంగా గుర్తిస్తారు. ప్రభుత్వానికి బాకా ఊదుతూ.. అవసరం లేకపోయినా ప్రతిపక్షంపై పడి విమర్శలు చేస్తే.. అధికార పక్షానికి మిత్రపక్షంగానే గుర్తిస్తారు. ఏపీ బీజేపీ ఇప్పుడు అదే పొజిషన్‌లో ఉంది.

పథకాల్లో కేంద్ర నిధుల వాటా గురించి అడిగే నెతలెక్కడ..?

తెలంగాణలో బీజేపీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్ర నిధుల గురించి విస్తృత ప్రచారం చేశారు. కేసీఆర్ పథకాలన్నీ కేంద్రం చలువేనన్నారు. గణాంకాలతో సహా బయట పెట్టారు. ఎంత తీవ్రంగా బీజేపీ నేతలు ఎదురుదాడి చేశారంటే.. చివరికి కేసీఆర్ కూడా.. ఆ ప్రచారంపై స్పందించాల్సి వచ్చింది. అప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయింది. బీజేపీకి ఓటు వేసినా.. తమకు పథకాలు ఆగవనే భరోసా లభించింది. కానీ ఏపీలో నేతలేం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే… అన్ని పథకాలు నడుస్తున్నా.. ఒక్కరంటే.. ఒక్కరూ చెప్పుకోవడం లేదు. చెప్పుకుంటే.. ఎక్కడ వైసీపీకి క్రెడిట్ తగ్గిపోతుందోనన్నట్లుగా ఉంటున్నారు. చివరికి నిన్నటికి నిన్న జగన్ ప్రారంభించిన అభయం ప్రాజెక్ట్ కు కేంద్రం అరవై శాతం నిధులు ఇస్తోంది. కానీ ఒక్క బీజేపీ నేత కూడాచెప్పుకోవడానికి సాహసించడం లేదు.

ప్రభుత్వంపై పోరాడేవారిని మూలన కూర్చోబెట్టేశారుగా..!?

తెలంగాణ బీజేపీ నేతలు… ప్రభుత్వంపై పోరాడే వారికి.. ప్రోత్సాహం ఇచ్చారు. అంతర్గత రాజకీయాలతో ఒకరినొకరు తొక్కేయాలని అనుకోలేదు. అందులో రఘునందన్ రావు లాంటి నేతలు బయటకు వచ్చారు. ఆయన ఒకప్పుడు టీఆర్ఎస్ నేతే. కానీ.. ఎక్కడా తగ్గలేదు. ఆయనే కాదు.. ప్రభుత్వంపై సిన్సియర్‌గా పోరాడేవారందరికీ.. నేతలు భరోసా ఇచ్చారు. కానీ ఏపీలో ఏం జరుగుతోంది..? వైసీపీ సర్కార్ పై ఎవరైనా విమర్శలు చేస్తే.. తర్వాత వారికి పార్టలో దేనికీ పిలుపు రాదు. కనీసం టీవీ చర్చల్లో కూర్చునే అవకాశం కూడా ఇవ్వరు. మాట వినకపోతే సస్పెండ్ చేస్తారు. అంటే ప్రో వైసీపీ వాయిస్ మాత్రమే బీజేపీ వినిపిస్తోందన్నమాట.

పార్టీలోకి ఎవరు వచ్చినా కోవర్టు ముద్రేస్తే .. ఎవరు చేరుతారు..!?

తెలంగాణలో బీజేపీ నేతలందరూ టీఆర్ఎస్ పై పోరాటం విషయంలో కలసి కట్టుగా ఉన్నారు. తమ మధ్య అంతర్గత విబేధాలున్నప్పటికీ.. అధికార పార్టీపై పోరాటం విషయంలో ఎక్కడా ఆ ప్రభావం కనిపించనీయడం లేదు. కానీ ఏపీలో బీజేపీ నేతలు మాత్రం.. ప్రో వైసీపీ.. యాంటీ వైసీపీగా విడిపోయారు. ఇప్పుడుయాంటీ వైసీపీకి వాయిస్ లేకుండా చేశారు. ప్రో వైసీపీ మాత్రమే.. బయటకు వస్తూ ఉంటుంది. ఫలితంగా.. అధికార పార్టీకి అనుబంధ సంస్థగా బీజేపీ కనిపించడం ప్రారంభమయింది. తెలంగాణలో బీజేపీ నేతలు.. స్థాయీ భేదం లేకుండా.. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతల ఇళ్లకు వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కానీ ఏపీ బీజేపీలో… తమ పార్టీలోకి వచ్చిన ఇతర పార్టీల నేతలపై కోవర్టు ముద్ర వేసి దూరం పెడుతున్నారు. దాంతో బీజేపీలో చేరడానికి ఇతరులు వెనుకడుగు వేస్తున్నారు.

ప్రతిపక్షంపై పోరాడితే పడేది.. అధికారపక్షానికి మిత్రుడి ముద్రే..!

అన్నింటి కన్నా ముఖ్యంగా తెలంగాణ బీజేపీ.. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని రాజకీయం చేస్తుంది. కానీ..ఏపీ బీజేపీ ప్రజాభిప్రాయాన్ని తనదైన శైలిలో మార్చేసుకుంటోంది. పోలవరం నుంచి అమరావతి వరకూ అదే పద్దతి. ప్రజలతో రాజకీయం చేయాలనుకున్నప్పుడు.. వారి మద్దతు పొందడమే ఏకైక మార్గం. కానీ.. బీజేపీకి అలాంటి ఆలోచనలు ఉన్నట్లుగా లేవు. వేరే దారిలో అధికారం వస్తుందనుకున్నారేమో కానీ.. అమరావతికే సపోర్ట్ అంటారు.. మూడు రాజధానులపై వైసీపీ సర్కార్ ను నిలదీయరు. పోలవరం పై మాట్లాడరు. విగ్రహాల గురించి మాత్రం ఉత్సాహపడతారు. చూసి నేర్చుకోలేనప్పుడు.. విజయాలు ఆశించడం కూడా అత్యాశే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close