ఆదాయాలు పెరగవు – ఖర్చులు తగ్గించుకోండి

ఆదాయాలు పెరగవు-ఖర్చులు తగ్గించుకోండి, ప్రభుత్వానికి వసుళ్ళ శాఖల మొర

ఆదాయాలు పెంచాలని ఆర్ధిక శాఖ సంబంధిత శాఖలకు సూచించడం ఎక్కడైనా జరిగేదే! అది జరిగేపని కాదుగానీ, మీరే ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్ధిక శాఖ ఆదేశాలను ఇతర శాఖలు తిప్పికొడుతున్న రివర్స్ గేమ్ ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది.

రెవిన్యూలోటు, సొంత వసతులు సదుపాయాలులేక అనుకోని ఖర్చులతో సతమతమౌతున్న ఆంధ్రప్రదేశ్ ఆదాయాలు ఇచ్చే వనరుల్ని మరికాస్త పిండటం మీదే రెండేళ్ళుగా దృష్టిపెట్టింది.

2014-15 కంటే 2015-16లో రూ.4వేల కోట్ల అదనపు ఆదాయ లక్ష్యాలను నిర్ణయించారు,2016-17 సంవత్సరంలో దీన్ని రూ. 11 వేల కోట్లకు పెంచారు. పన్నులు, రుసుములు, ఫీజుల ద్వారా రాష్ట్రానికి ఆదాయాలు తెచ్చే వాణిజ్య పన్నులశాఖ, ఎక్సయిజు శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ లు ఇది జరిగే పని కాదని తేల్చేశాయి. ”అందరూ కూడబలుక్కుని” చెప్పినట్టు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు వేర్వేరు మాటల్లోనే అదనపు వసూళ్ళు సాధ్యం కావని ఆర్ధికశాఖకు ఉత్తరాలు రాశారు. ‘ఆదాయాలు పెంచడం సాధ్యం కాదు మీరే ఖర్చులు తగ్గించి ఫైనాన్సెస్ ని బేలెన్స్ చేయాలన్నదే” ఆలేఖల సారాంశమని అధికార వర్గాల ద్వారా తెలిసింది.

కొన్ని వస్తువులపై పన్నుల మినహాయింపు రద్దు చేసి వాటిని పన్నుల షెడ్యూల్‌లోకి చేర్చాలని, పన్నుల విధానంలో కూడా మార్పులు తీసుకురావాలని, అప్పుడే అదనపు వసూళ్ళ లక్ష్యం కొంతైనా వీలౌతుందని కూడా పలు శాఖలు ఆర్ధికశాఖకు సూచించాయి.

వత్తిడి పెంచడం వల్ల ఇప్పటికే పన్నులు, ఫీజుల చెల్లింపుదారుల్లో అసహనం పెరిగిపోయింది. ఇదే కొనసాగడం వసూళ్ళ సిబ్బందిలో నిస్పృహను పెంచేసే ప్రమాదం వుంది.

ఈ పరిస్ధితిని చక్కదిద్దే బాధ్యత ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ కళ్ళాం మీద పడింది. ఆయన గతంలో ఇదే బాధ్యత నిర్వహించారు. రెండోసారి రమేష్ స్ధానంలో పాతబాధ్యతల్లో నియమితులయ్యారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ ఆర్ధికశాఖను మోయడమంటే నెత్తిమీద పేడతట్ట పెట్టుకున్నట్టే!

“బాబూ ఖర్చుతగ్గించుకోండి అని పదేపదే ముఖ్యమంత్రికి విన్నవించుకుంటూ వుండటమే అజాయ్ కళ్ళాం గారి మొదటి పని అయ్యేలా వుంది…ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కర్తా, కర్మా, క్రియా, సర్వస్వమూ చంద్రబాబే కాబట్టి! ఆయనకి చెబితే పరివేల మందికి చెప్పినట్టే కాబట్టి!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close