పెట్రోల్ ధర సెంచరీ దాటే మొదటి రాష్ట్రం ఏపీనే..!?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ఏడాదికోసారి పథకాల పేరుతో రూ. ఐదు వేలో.. పదివేలో కొన్ని లక్షల కుటుంబాలకు నగదు బదిలీ చేస్తోంది. కానీ వాటికి సంబంధించిన నిధుల కోసం… అన్ని వర్గాల ప్రజలను రోజువారీగా బాదేస్తోంది. అన్నింటితో పాటు.. పెట్రోల్, డీజీల్‌పైనా ఈ బాదుడు ఉంది. కాకపోతే.. వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వసూలవుతుందనుకుంటున్నారేమో కానీ… అత్యధిక పన్నులు వసూలు చేసి.. పిండేసుకుంటోంది. రోజువారీగా పెరుగుతున్న ధరలకు తోడు ఈ పన్నులు కూడా పెరగడంతో ప్రజల జేబుకు చిల్లు పడుతోంది.

ఏపీ సర్కారు పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్ విధిస్తున్నారు. పెట్రో ధరలు పెంచే కొద్దీ.. ఈ వ్యాట్ కూడా పెరుగుతుంది. జగన్ సర్కారు వ్యాట్‌తోపాటు పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.4 చొప్పున అదనపు వ్యాట్‌ను వసూలు చేస్తోంది. రోడ్లు బాగోలేవని ప్రజలు మొత్తుకుంటూంటే.. సరే అని రోడ్ డెవలప్‌మెంట్ సెస్ కూడా వడ్డించింది. దీంతో దక్షిణాదిలోనే అత్యధిక ధర ఏపీలో ఉంటుంది. పొరుగున ఉన్న తెలంగాణతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ ధర దాదాపుగా నాలుగు రూపాయలు ఎక్కువ. తమిళనాడు, కర్ణాటకతో పోలిస్తే.. దాదాపుగా నాలుగున్నర ఎక్కువ. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 93 రూపాయలకు చేరుకుంది. తెలంగాణలో ఇది 88-89 రూపాయల మధ్య ఉంది.

ట్యాక్సులు, సెస్సుల రూపంలో ఒక్క లీటర్ పెట్రోల్‌పై రూ.33.50 పైసలు, లీటర్ డీజిల్‌పై రూ.24 వసూలు చేస్తోంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లోని ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులకు గిరాకీ పెరిగింది. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటే ఎంత ఎక్కువ అవుతుందో ఫ్లెక్సీలు కూడా ప్రదర్శిస్తున్నారు. దాంతో కొంత మంది అటు వైపు వెళ్లి పెట్రోల్ కొట్టించుకొస్తున్నారు. ఏపీ మీదుగా వెళ్లేవాళ్లు… ట్యాంక్ ఫుల్ చేయించుకుని వచ్చి ఏపీ దాటుతున్నారు.

కొసమెరుపేమిటంటే… ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పెట్రోల్ ధరల గురించి చాలా ఆవేశంగా మాట్లాడారు. ప్రజల్ని బాదేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తర్వతా వివిధ సభల్లోనూ రాగాలు తీస్తూ బాదుడే.. బాదుడు అంటూ విమర్శలు గుప్పించారు. కానీ ఇప్పుడు నిజంగానే… ఆయన పన్నులు వడ్డిస్తూ.. అత్యధిక ధర ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా మార్చారు. త్వరలో వంద దాటే అవకాశం ఉండటంతో.. అధికార పార్టీ మీడియా ఇప్పుడే ప్రజల్ని మానసికంగా ప్రిపేర్ చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో వంద దాటిపోయిందని ప్రచారం చేస్తోంది. పవర్ పేరుతో అమ్మే బ్రాండ్ల పెట్రోల్ రాజస్థాన్‌లో వంద దాటింది. ఏపీలో బ్రండ్లు కాకుండానే వంద దాటే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close