మురుగదాస్ నీతులు చేతల్లో కనిపించడం లేదేంటి?

హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తీసిన సినిమా ‘సర్కార్’ పలు సంచలనాలు సృష్టించింది. ఇప్పుడదే పేరుతో తమిళంలో ఇలయ దళపతి విజయ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన ఏఆర్ మురుగదాస్ ఓ సినిమా తీస్తున్నాడు. హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్స్‌కి ఆయన అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. అయితే… తెలుగు ప్రేక్షకులే అందులో ఓ లుక్ చూసి ఒకప్పుడు ఎంతో నీతులు చెప్పిన మురుగదాస్ ఇలా చేశాడేంటి అని అనుకోవలసి వచ్చింది. హీరో విజయ్ సిగరెట్ కలుస్తున్న స్టిల్ అసలు విమర్శలకు కారణం!

దర్శకుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న కొద్దీ తనకంటూ కొన్ని రూల్స్ రాసుకున్నాడు మురుగదాస్. అతడి సినిమాల్లో హీరోలు మందు కొట్టరు. సిగరెట్లు కాల్చరు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించరు. ఆఖరికి విలన్లు కూడా గ్రీన్ టీ తాగుతారు. తమిళంలో విజయ్ హీరోగా ఆయన తీసిన ‘కత్తి’ని తెలుగులో చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’గా రీమేక్ చేశారు. అందులో చిరు మందుకొట్టే సీన్లు చూసి మురుగదాస్ అప్‌సెట్‌ అయ్యారని మొదట్లో వార్తలు వచ్చాయి. ‘స్పైడర్’ ఇంటర్వ్యూలలో నేరుగా ఆ సంగతి ప్ర‌స్తావించ‌కున్నా… త‌న అసంతృప్తిని వ్యక్తం చేశారు. హీరోలను ఎంతోమంది అభిమానిస్తారు క‌నుక చెడు అల‌వాట్ల‌కు దూరంగా వుంటే మంచిద‌ని చెప్పారు. అటువంటి దర్శకుడు హీరో ఫస్ట్ లుక్‌లో సిగరెట్‌తో చూపించడం జ‌నాలకు మింగుడు ప‌డ‌టం లేదు. మురుగదాస్‌లో ఈ మార్పు ఏమిటో? క్యారెక్ట‌ర్ డిమాండ్ చేసి వుంటుంది!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close