భ‌ళ్లాల‌దేవుడికి మ‌రో కొడుకున్నాడు..

భ‌ళ్లాల‌దేవుడి మ‌ర‌ణంతో ‘బాహుబ‌లి’ క‌థ అయిపోయింద‌నుకొంటున్నాం అంతా. కానీ.. అక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. అదేంటంటే… బాహుబ‌లి క‌థ‌కి ‘ఎండ్ కార్డ్‌’ ఇంకా ప‌డ‌లేదు. ఈ క‌థ ఇంకా కొన‌సాగుతుంది. భ‌ళ్లాల‌దేవుడి త‌న‌యుడిగా అడ‌విశేష్‌ని చూపించారు. త‌న‌ని బాహుబ‌లి వ‌ధించాడు. ఆ త‌ర‌వాత భ‌ళ్లాల‌దేవుడూ చ‌నిపోయాడు. అక్క‌డితో క‌థ అయిపోలేదు. భ‌ళ్లాల‌దేవునికి మ‌రో కొడుకు ఉన్నాడు. తాను బాహుబ‌లిపై ప‌గ తీర్చుకోవాల‌ని చూస్తాడ‌ట‌. సో.. బాహుబ‌లి క‌థ కొన‌సాగుతుంది. కాక‌పోతే… సినిమాగా కాదు. క‌థ‌లు, యానిమేష‌న్‌ల రూపంలో బాహుబ‌లి క‌థ కొన‌సాగ‌బోతోంది. అందులో భ‌ళ్లాల‌దేవుడి కొడుకు పాత్ర కీల‌క‌మ‌ట‌. బాహుబ‌లిపై తాను ప‌గ తీర్చుకోవాల‌ని చూస్తుంటాడ‌ట‌. బాహుబ‌లి ప‌రిపాల‌న ఎలా సాగింది? అవంతిక‌ని బాహుబ‌లి పెళ్లి చేసుకొన్నాడా లేదా? అనేది బాహుబ‌లి 2కి కొన‌సాగింపుగా చూపించ‌బోతున్నార్ట‌.

ఈ విష‌యాన్ని బాహుబ‌లి క‌థ‌కుడు విజ‌యేంద్ర ప్ర‌సాద్ కూడా ఒప్పుకొన్నారు. బాహుబ‌లి 1, 2ల‌లో చూపించ‌ని చాలా పాత్ర‌లు ఇప్పుడు కొత్త రూపం సంత‌రించుకొంటాయ‌ని, బాహుబ‌లి క‌థ‌ని ముందుకు తీసుకెళ్ల‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని అంటున్నారాయ‌న‌. భ‌విష్య‌త్తులో ఎప్పుడైనా బాహుబ‌లి 3 తీయాల‌నుకొంటే రాజ‌మౌళి ద‌గ్గ‌ర బోల్డంత స్ట‌ఫ్ ఉన్న‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com