“బండి” యాత్రకు మళ్లీ రెడ్ సిగ్నల్..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు పాదయాత్ర ముహుర్తాలు ఏ మాత్రం కలసి రావడం లేదు. రెండో సారి కూడా ఆయన అనివార్య పరిస్థితుల్లో యాత్రను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరైన యూపీ మాజీ సీఎం కళ్యామ్ సింగ్ చనిపోవడంతో బీజేపీ ఆరు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఈ రోజుల్లో పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని నిర్ణయించారు. దీంతో ఎల్లుండి నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న బండి సంజయ్ పాదయాత్రను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ఎప్పుడు ప్రారంభించేది త్వరలో ప్రకటిస్తారు. ఏ ఆటంకాలు లేకపోతే 30వ తేదీన ప్రారంభించాలని అనుకుంటున్నారు.

నిజానికి బండి సంజయ్ పాదయాత్ర ఈ నెల తొమ్మిదో తేదీనే ప్రారంభించాలనుకున్నారు. కానీ అప్పటికి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూండటంతో హైకమాండ్ అనుమతి ఇవ్వలేదు. అదే సమయంలో కిషన్ రెడ్డి కూడా జన ఆశీర్వాద్ యాత్రలు పెట్టుకున్నారు. ఈ కారణంగా వాయిదా వేసుకోక తప్పలేదు. కిషన్ రెడ్డి జన ఆశీర్వాత్ యాత్రలు ముగిసిన వెంటనే ప్రారంభించాలని 24వ తారీఖు ఖరారు చేసుకున్నారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో ప్రచారం కూడా భారీగానే చేశారు. 30 కమిటీలు ఏర్పాట్లు చేశాయి. ఎలాంటి సౌకర్యాలు లేని చిన్న టెంట్‌లో ఉంటూ పాదయాత్ర చేస్తారంటూ “సింపుల్” పబ్లిసిటీ కూడా ఓ రేంజ్‌లో చేశారు. తీరా.. ముహుర్తం దగ్గరకు వచ్చేసరి కల్యాణ్ సింగ్ మరణం కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.

బండి సంజయ్ పాదయాత్ర చేయడం కేంద్రంలో కేబినెట్‌ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఇష్టం లేదన్న ప్రచారం ఆ పార్టీలో ఉంది. ఆయితే కిషన్ రెడ్డి తన గురువు అని.. తన అభిమాన నేత అని బండి సంజయ్ ఇటీవలి కాలంలో చెబుతున్నారు. పాదయాత్రకు హైకమాండ్ నుంచి ఆటంకాలు లేకుండా ఉండాలంటే కిషన్ రెడ్డి సహకారం తప్పనిసరి కావడంతో బండి సంజయ్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సారైనా ఆయన పాదయాత్ర ప్రారంభమవుతుందో.. ఏదైనా కారణంతో వాయిదా పడుతుంతో నని ఆయన వర్గీయులు టెన్షన్ పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close