తెలంగాణ‌లో భాజ‌పా ఎంట్రీకి మార్గం సుగ‌మ‌మైందా..?

తెలంగాణ‌లో భ‌విష్య‌త్తు మాదే… ఇదే ధీమాను వ్య‌క్తం చేశారు రాష్ట్ర భాజ‌పా అధ్యక్షుడు ల‌క్ష్మ‌ణ్‌. రాష్ట్రంలో సార్ కారుకి పంక్చ‌ర్ అయింద‌నీ, ప‌ద‌హారు సంఖ్య గ‌ల్లంత‌యింద‌న్నారు. తెరాస పెత్తందారీ ప్ర‌భుత్వానికి అస‌లు సిస‌లైన ప్ర‌త్యామ్నాయం భాజ‌పా అని ప్ర‌జ‌లు విశ్వ‌సించార‌న్నారు. ముఖ్య‌మంత్రి కుమార్తెను సైతం ఓడించే స్థాయికి తెలంగాణ‌లో భాజ‌పా ఎదిగింద‌న్నారు. ఇప్ప‌టికైనా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చి, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేలా పాలించాల‌న్నారు. భాజ‌పా ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండి పోరాటం చేస్తుంద‌న్నారు. నాలుగు నెల‌ల కింద‌ట కేసీఆర్ కి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన ప్ర‌జ‌లే, ఇప్పుడు భాజ‌పాకి ఓటేశారంటే… తెరాస పాల‌న ఎంత అహంకార‌పూరితంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు ల‌క్ష్మ‌ణ్‌. మొత్తానికి, తెలంగాణ‌లో త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించ‌గ‌లిగే వాయిస్ వ‌చ్చింద‌న్న‌ట్టుగా ఆయ‌న ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఒక్క‌టంటే ఒక్క సీటు మాత్ర‌మే భాజ‌పాకి వ‌చ్చింది. దాంతో, రాష్ట్రంలో ఈ పార్టీకి ఇక స్థానం లేద‌నే విమ‌ర్శ‌లూ అంచ‌నాలూ చాలా వ‌చ్చాయి. అయితే, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి నాలుగు చోట్ల భాజ‌పా ఎంపీలు గెలిచారు. సంఖ్యాప‌రంగా చూసుకుంటే ఇదేమీ పెద్ద నంబ‌ర్ కాదుగానీ, తెలంగాణ భవిష్య‌త్తు రాజ‌కీయాల్లో భాజపా బ‌ల‌ప‌డ్డానికి ప‌డిన పునాదిగా ఈ ఫ‌లితాన్ని చూడొచ్చు. తెలంగాణ‌లో ఈ ఎంపీల గెలుపుతో… భాజ‌పా త‌రువాతి ల‌క్ష్యం ఈ రాష్ట్రమే అన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. నిజానికి, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే.. భాజ‌పాను విస్త‌రింప‌జేయాల‌నుకునే రాష్ట్రాల జాబితాలో కూడా తెలంగాణ ఉంది. అయితే, ఆ త‌రువాత కొన్నాళ్ల‌పాటు మోడీ పాల‌న‌కు కాస్త అనుకూలంగా తెరాస వ్య‌వ‌హార శైలిలో కొంత మార్పు కొన్నాళ్లు క‌నిపించింది. ఆ త‌రువాత‌, కర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల్లో భాజ‌పాకి అధికారం ద‌క్క‌కపోవ‌డం, మ‌రో మూడు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నిక‌లు రావ‌డం… ఇలా వ‌రుస ప‌రిణామాల నేప‌థ్యంలో భాజ‌పా ల‌క్ష్యం కొంత ప‌క్క‌కు వెళ్లిన‌ట్ట‌యింది.

ఇప్పుడు, రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు, కేంద్రంలో మ‌రోసారి అధికారం… భాజ‌పా విస్త‌ర‌ణ‌కు సానుకూలంగా క‌నిపిస్తున్నాయి. దీనికి తోడు, రాష్ట్రంలో తెరాస‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బ‌ల‌హీనంగా క‌నిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ముగ్గురు బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఎంపీలుగా గెలిచినా… కేంద్రంలో అధికార బ‌ల‌మున్న భాజ‌పాకే రాజ‌కీయంగా కొంత అడ్వాంటేజ్ ఉండే అవ‌కాశాలే స‌హ‌జంగా ఉంటాయి. మొత్తానికి, తెలంగాణ‌లో భాజ‌పా విస్త‌ర‌ణ‌కు ఇది పునాదిగానే క‌నిపిస్తోంది. మున్ముందు ఎలాంటి ప‌రిణామాలుంటాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close