బీజేపీకి మాధురీ – కాంగ్రెస్‌కు కరీనా..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఇటీవలి కాలంలో.. బాలీవుడ్ స్టార్లతో వరుసగా సమావేశమవుతున్నారు. సె‌ల్ఫీల రూపంలో వాటిని సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. ఇందులో చిన్నా పెద్ద నటుల తేడా లేదు. ఓ మాదిరి సెలబ్రిటీ అయినా.. మోడి ఫిదా అయిపోతున్నారు. మోడీ లాంటి వ్యక్తే తమను.. ఇంత గౌరవం ఇస్తున్నారని.. బాలీవుడ్ స్టార్లు ఆయనను.. సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా… ఆరేడు నెలల పాటు… మోడీ అపాయింట్‌మెంట్ దొరకదు కానీ… కపిల్ శర్మ అనే కామెడి షో హోస్ట్‌కు మాత్రం అరగంటలో దొరికేస్తుంది. ఇది ఢిల్లీలో అందరికీ తెలిసిన విషయం. మోడీ సినిమా వాళ్లతో ఎందుకు ఇంతగా రాసుకుపూసుకు తిరుగుతున్నారంటే.. వారికి ఉన్న అభిమానాన్ని బీజేపీకి ఓట్లుగా మల్చుకోవడమే. వీలైతే.. వారిలో ఒకరిదిద్దరికి బీజేపీ తరపున పోటీకి కూడా అవకాశం కల్పించబోతున్నారట.

మాధురీ దీక్షిత్ అంటే… బీజేపీ అగ్రనాయకత్వానికి వల్లమాలిన అభిమానం. ఆమె ఇటీవలి కాలంలో వార్తల్లో లేకపోయినా.. కెరీర్‌ను దాదాపుగా వదిలేసినా… ” సంపర్క్ ఫర్ సమర్థన్” అంటూ.. నేరుగా అమిత్ షానే వెళ్లి కలిసి వచ్చారు. ఆ తర్వాత ఆమె లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతోందని మీడియాలో ప్రసారమయ్యేలా చేశారు. ఆమెలో ఓ ఆశ రేపారు. పుణె నుంచి మాధురీదీక్షిత్‌ను బరిలోకి దించుతామని.. మహారాష్ట్ర బీజేపీ ముఖ్యులు చెప్పుకొచ్చారు. ఇప్పటికే కిరణ్ ఖేర్, హేమమాలిని, పరేష్ రావల్, అనుపమ్ ఖేర్ లాంటి బాలీవుడ్ నటులు బీజేపీలో ఉన్నారు. బాబుల్ సుప్రియో లాంటి సింగర్ని ఏకంగా కేంద్రమంత్రిని కూడా చేశారు. కానీ వీరు ఫామ్‌లో ఉన్న హీరోలు, హీరోయిన్లు కాదు. మోడీకి కావాల్సింది హీరోలు, హీరోయిన్లు. అందుకే… మాధురీదీక్షిత్ వైపు చూస్తున్నారు. మరికొందరు బాలీవుడ్ తో పాటు… కన్నడ. తమిళ, తెలుగు, మలయాళ చిత్ర సీమల్లోని నటీనటులపైనా.. బీజేపీ కన్నేసింది. ఎవరికీ ఇవ్వనంత ప్రయారిటీ సినిమాళ్లకు ఇచ్చి.. బీజేపీ అగ్రనేతలు వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడాలని అనుకోవడం లేదు. బీజేపీ మాధురీ అంటే.. తాను కరీనా అంటోంది. ఇటీవలే అధికారం చేపట్టిన మధ్యప్రదేశ్‌ నుంచి కరీనాకపూర్‌ను నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. భోపాల్ నుంచి కరీనాను దించాలని స్థానిక నేతలు ప్రతిపాదించారు. దీనికో కారణం ఉంది.. కరీనా భర్త సైఫ్ అలీఖాన్ పటౌడీ కుటుంబానికి రాజకీయ నేపధ్యం ఉంది. పటౌడి వారసురాలిగా ఆమెను భోపాల్ ప్రజలు ఆదరిస్తారనిఅంటున్నారు. మొత్తానికి రెండు పార్టీలు.. బాలీవుడ్ స్టార్లతో … బాక్సాఫీస్ సమరం కాకుడా.. బ్యాలెట్ సమరాన్ని ఏర్పాటు చేయాలని దాదాపుగా నిర్ణయించుకున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close