చైతన్య : కమల్ ట్రాప్‌లో బీజేపీ..! గాడ్సేనే వాళ్లకు ఆరాధ్యుడు..!

భారతదేశంలో మొదటి హిందూ టెర్రరిస్ట్… నాథూరాం గాడ్సే అని కమల్ హాసన్ అనగానే… బీజేపీ నేతలు చెలరేగిపోయారు. కమల్ హాసన్‌పై… మండిపడ్డారు. ఆయన నాలిక కోసేయాలన్నారు. ఇంకేదేదో చేయాలన్నారు. కానీ.. వారికి తెలియకుండానే.. వారు ట్రాప్‌లో పడిపోయారు. తమకు గాంధీ కన్నా గాడ్సేనే ఎక్కువని నిరూపించారు. కమల్ చాలా పక్కాగా వారిని ట్రాప్‌లో పడేశారు.

బీజేపీకి గాంధీ కన్నా గాడ్సేనే ఎక్కువ..!

భారతీయ జనతా పార్టీ… నేతలు వినిపించే జాతీయవాదం.. క్రమక్రమంగా రంగు మారుతోంది. ఈ ఎన్నికల ప్రారంభం నాటితో పోలిస్తే.. చివరికి వచ్చే సరికి.. తమ జాతీయ వాదంలోఅసలు రంగు,రుచి, వాసన ఎలా ఉంటుందో.. నేతల ద్వారా బయట పెడుతున్నారు. భారతదేశానికి మహాత్ముడు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. మహాత్మాగాంధీ. దేశ ప్రజలందరికీ ఆయనంటే అమితమైన గౌరవం. అందుకే.. రాజకీయ పార్టీలన్నీ.. తాము గాంధేయవాదాన్ని అనుసరిస్తామని చెబుతూ ఉంటాయి. బీజేపీ కూడా అదే చెబుతుంది. కానీ.. నిజంగా.. బీజేపీ గాంధేయవాదాన్ని అనుసరించదు. గాంధీని చంపిన గాడ్సేపై అమితమైన అభిమానం ప్రదర్శిస్తుంది. అది ఇప్పుడు బయటపడింది.

బీజేపీ మళ్లీ గెలిస్తే గాంధీ కన్నా గాడ్సేనే గొప్పవాడంటుంది..!

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాత్ముని ప్రస్తావన చాలా వరకు తగ్గిపోయింది. కానీ గాడ్సే మాత్రం తరచూ వార్తల్లోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ సిద్దాంతకర్త సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ .. అంతర్గత ప్రకటనల్లో గాంధీని ప్రశంసించేది తక్కువ. గాడ్సేది పొగిడేది ఎక్కువ. బహుశా.. దేశ విభజనకు ప్రధాన కారణం మహాత్ముడేనని … వాళ్లు భావించడం కావొచ్చు. అందుకే.. గుజరాత్‌ కు చెందిన మోడీ ప్రధాని అయినా …మహాత్ముడిని కాదని… వల్లభాయ్ పటేల్‌కు వేల కోట్లతో విగ్రహాన్ని నిర్మించారు. మహాత్ముడి ఆశ్రమం ఉన్న పోర్ బందర్.. కనీస అభివృద్ధికీ నోచుకోవడం లేదు. మీ పార్టీది గాడ్సేవాదం.. అంటే.. బీజేపీ నిస్సంకోచంగా ఖండిస్తుంది. ఎందుకంటే.. ఆ పార్టీ ఇంకా.. దేశ ప్రజల్లో… గాంధీ కన్నా గాడ్సేనే గొప్ప అన్న భావజాలాన్ని ఎక్కించలేదు. బహుశా.. మరోసారి అధికారం దక్కితే.. ఆ పని కూడా పూర్తి చేయవచ్చనే విమర్శలు ఉన్నాయి.

బీజేపీకి గాంధీ అంటే ఎందుకు ఇష్టం ఉండదు..?

గాంధేయవాదం కన్నా… గాడ్సే వాదాన్నే.. ఎందుకు…బీజేపీ నెత్తికెక్కించుకునే పని చేస్తోందని…ఆలోచిస్తే… భావజాలంతో పాటు..రాజకీయ పరిస్థితులు కూడా కారణం అని చెప్పవచ్చు. ఆరెస్సెస్ కు స్వాతంత్ర పోరాటంలో ఎలాంటి పాత్ర లేదు. కానీ భావజాలం మాత్రం… వేరుగా ఉండేది గాంధీ సిద్ధాంతాలకు అది పూర్తి భిన్నం. ఆ క్రమంలో దేశ విభజన.. ఇతర మతపరమైన కారణాలతో… విబేధాలు ఇంకా తీవ్రంగా ఉండేవి. అవి సిద్ధాంతపరమైన విబేధాలు. అప్పట్నుంచి అవి అలా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు.. బీజేపీ ..గాంధేయవాదాన్ని నిర్లక్ష్యం చేయడానికి కారణం.. రాజకీయం. గాంధీ అనే పేరుకు ఎంత ఎక్కువ మహనీయత కల్పిస్తే.. ఎంత ఎక్కువగా కాంగ్రెస్‌కు లాభిస్తుందనే భయం బీజేపీ నేతలదనే ప్రచారం ఉంది. ఎందుకంటే.. కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ ప్రతీ పేరులోనూ గాంధీ ఉంటుంది. అందుకేనేమో.. నకిలీ గాంధీలని బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ పేరు తీసేయాలని డిమాండ్ చేస్తూ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close