A2- బీజేపీ కార్యకర్త – A3 బీఆర్ఎస్ సర్పంచ్ కూతురు !

రాజకీయం చేయాలనుకోవాలి కానీ జరిగే ప్రతి విషయానికీ తమ వ్యతిరేక పార్టీకి లింక్ పెట్టేసుకోవచ్చు. ఏ నేరం జరిగినా దానిలో నిందితులు మీ పార్టీ వారేనని మీ అగ్రనేతలకు సంబంధం ఉందని ఆరోపణలు చేసేస్తూ ఉంటారు నేతలు. ఇప్పుడు తెలంగాణలో పేపర్ లీకేజీ రాజకీయం నడుస్తోంది. ఈ రాజకీయం కూడా అంతే. ఈ కేసు బయటపడగానే.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన రాజకీయ వివాదం అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బీజేపీ పార్టీ కార్యకర్త అని కేటీఆర్‌ రిట్వీట్‌ చేశారు. ఈ విషయంలో తగిన దర్యాప్తు నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ను ట్విట్టర్‌ ద్వారా కోరారు. రాజకీయ పార్టీగా బీజేపీ అత్యంత దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని, ప్రస్తుత పరిణామం ఆ పార్టీ మరింత దిగజారుడు రాజకీయా లకు నిదర్శనమని ఘాటుగా వ్యాఖ్యానించారు. వెంటనే బండి సంజయ్ కూడా అందుకున్నారు. ఈ కేసులో ఏ త్రీ నిందితురాలిగా ఉన్న రేణుకా రాథోడ్ తల్లి బీఆర్ఎస్ సర్పంచ్ అని ఓ మిడీయాలో వచ్చిన వార్తను పోస్ట్ చేసి… మొత్తం గుట్టు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

నిజానికి దిగువ స్థాయి రాజకీయ వ్యవహారాల్లో పాలు పంచుకునే ఈ నిందితులకు పెద్ద స్థాయి నేతలతో కనీసం పరిచయాలు కూడా ఉండవు. కానీ నఈ కేసు బయటపడేసరికి వారిని పెద్ద లీడర్లుగా మార్చేసి రాష్ట్ర నేతలు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. గతంలోనూ తెలంగాణలో ఇలాంటి పేపర్ లీక్ కేసులు బయటపడ్డాయి. కానీ తీసుకున్న చర్యలు పెద్దగా లేవు. ఇప్పుడు కూడా రెండు పార్టీలు చేయాల్సినంత రాజకీయం చేసుకుని సైలెంట్ అవుతాయన్న విమర్శలు అందుకే వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close