బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్…! త్వ‌ర‌లోనే మార్పు

తెలంగాణ కోసం పుట్టిన పార్టీ… తెలంగాణ రాష్ట్రం కోస‌మే ఎగిరిన గులాబీ జెండా.. తెలంగాణ బాగు కోస‌మే తండ్లాట‌… ఇలా త‌మ పార్టీ గురించి కేసీఆర్ ఎంతో గొప్ప‌గా చెప్పుకుంటారు. నిజానికి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కూడా టీఆర్ఎస్ అంటే ఓ తెలియ‌ని న‌మ్మ‌కం ఉండేది.

కానీ, జాతీయ రాజ‌కీయాల కోసం అంటూ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లాగే బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ అని ప్ర‌క‌టించుకున్నారు. పేరు మారిందే కానీ తెలంగాణ‌పై ప్రేమ మార‌లేద‌ని కేసీఆర్ అండ్ టీం ఎంత చెప్పుకున్నా తెలంగాణ ప్ర‌జ‌ల‌తో ఉన్న ఎమోష‌న‌ల్ క‌నెక్ష‌న్ మిస్ అయ్యింది. ఓట‌మి త‌ర్వాత బీఆర్ఎస్ నేత‌ల‌కు అర్థం అవుతోంది.

తెలంగాణ ప్ర‌జ‌ల‌తో టీఆర్ఎస్ పార్టీది పేగు బంధం అని కేవ‌లం రాజ‌కీయాలు కాద‌ని గులాబీ నేత‌లు చెప్పుకునే వారు. కానీ, పార్టీ పేరు మార‌క ప్ర‌జ‌ల్లోనూ వ్య‌తిరేక‌త వ‌చ్చింది. కిందిస్థాయి లీడ‌ర్ల‌కు ఆ నిర్ణ‌యం న‌చ్చ‌కున్నా కేసీఆర్ మాట‌కు ఎదురు చెప్ప‌లేక ఓకే అన్నారు.

కానీ, ప‌రిస్థితులు మారిపోయాయి. పదేళ్ల పాల‌న చేసిన పార్టీకి 100రోజుల ప్ర‌తిప‌క్ష పాత్ర‌లో అనేక స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. పార్టీ ఉనికే ప్ర‌శ్నార్థ‌కం అయ్యేలా త‌యారైంది. దీంతో గులాబీ ద‌ళంలో పున‌రాలోచ‌న‌లో ప‌డింది. బీఆర్ఎస్ ను మ‌ళ్లీ టీఆర్ఎస్ గా మార్చే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అయితే, బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ కు మార‌టం అంత హిజీ కాదు. టీఆర్ఎస్ పేరు మార్చుకోగానే సిద్ధిపేటకే చెందిన ఓ వ్య‌క్తి టీఆర్ఎస్ పార్టీని రిజిస్ట‌ర్ చేయించుకున్నారు. త‌ను ఒప్పుకుంటే కానీ ఇప్పుడు పార్టీ పేరు మార‌దు. అయితే, టీఆర్ఎస్ రిజిస్ట‌ర్ చేయించుకున్న వ్య‌క్తి హ‌రీష్ రావు చెప్తే వింటార‌న్న అభిప్రాయం ఉన్న త‌రుణంలో… మాజీ మంత్రి హ‌రీష్ రావు చేసిన ఓ ప్ర‌క‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. బీఆర్ఎస్ పేరును మ‌ళ్లీ టీఆర్ఎస్ గా మార్చే ఆలోచ‌న ఉంద‌ని… దీనిపై కేసీఆర్ గారు నిర్ణ‌యం తీసుకుంటార‌ని పార్టీ పేరు మార్పును చెప్ప‌క‌నే చెప్పారు. చూడాలి మ‌రీ… పేరు మార్చిన త‌ర్వాత టీఆర్ఎస్ త‌ల‌రాత మ‌ళ్లీ మారుతుందో లేదో!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close