ఎన్నికలొస్తున్నాయి.. మళ్లీ ఓటుకు నోటు కేసు బయటకొచ్చింది..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఓటుకు నోటు కేసు హడావుడి ఓ రేంజ్‌లో నడిచింది. రేవంత్ రెడ్డిని మూడు రోజుల పాటు ఇంట్లో ఉంచి మరీ… సోదాలు చేశారు. ఏం కనిపెట్టారో చెప్పలేదు. ఆ తర్వాత ఆ కేసులో ఉన్న వారినందర్నీ.. ఈడీ ఆఫీసుకు రెండు, మూడు విడతలుగా పిలించి ప్రశ్నించారు. ఆ తర్వాత పోలింగ్ అయిపోయింది. అందరూ.. రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ.. ఎన్నికల వేడి పెరుగుతోంది. రేపోమాపో…లోక్ సభ ఎన్నికలు నోటిఫికేషన్ రావడం ఖాయమవడంతో.. మరోసారి ఈడీ అధికారులు నిద్రలేచారు. కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డిని ఆయన కుమారులను పిలిపించి రోజంతా కూర్చోబెట్టి పంపించారు. మళ్లీ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ సీరియల్‌ ఇలా ఎన్నికల వరుక నానుతూనే ఉంటుంది.

అసలు స్టిఫెన్సన్‌కు ఇచ్చిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది కనిపెట్టడమే… ఈడీ లక్ష్యం. దీన్ని కనిపెట్టడానికి తెలంగాణ ఏసీబీ చాలా ప్రయత్నించింది. అవి తాము తెచ్చినవి కాదని… ఆ డబ్బుతో తమకు సంబంధం లేదని… రేవంత్ రెడ్డి సహా.. అందరూ చెప్పుకొస్తున్నారు. “కాదు అవి మీవే అని ఐటీ,ఈడీ అధికారులు రేవంత్ రెడ్డి దగ్గర విచారణలో గట్టిగా అనడంతో… అయితే.. ఆ డబ్బులో ఫైన్ ఎంతో కట్ చేసుకుని మిగతా డబ్బులిచ్చేయండి.. అని” రేవంత్ గడుసుగానే సమాధానం చెప్పడంతో.. వాళ్లు కూడా సైలంటవ్వాల్సి వచ్చింది. అప్పట్నుంచి ఆ డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఈ ప్రయత్నం.. రాజకీయ అవసరాల కోసమే జరుగుతూండటంతో ముందుగు జరగడం లేదు.

నిజానికి.. ఈ తరహా కేసులు… ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ గా ఉన్నాయి. అక్కడ బీజేపీ నేతలు.. అదీ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప లాంటి వాళ్లు.. ఒక్కో ఎమ్మెల్యేకు.. రూ. వంద కోట్లు ఇస్తామంటూ.. ఆఫర్ చేశారు. అలా చేశామని.. ఒప్పుకున్నారు కూడా…! కానీ.. వారిపై.. ఏ ఐటీ, ఈడీ దాడులు జరగడం లేదు. ఎక్కడ్నుంచి తెచ్చి ఇస్తారని అడగడం లేదు. కానీ.. నాలుగేళ్ల కిందటి కేసులో.. ఇస్తామని చెప్పిన మొత్తం ఎక్కడ్నుంచి తెచ్చి ఇస్తారని మాత్రం.. నోటీసుల మీద నోటీసులు జారీ చేసి.. రోజుల తరబడి.. ఈడీ ఆఫీసులో నేతల్ని కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నారు. కొసమెరుపేమిటంటే.. కొన్ని వేల కోట్ల… ఆస్తులు అటాచ్ చేసిన జగన్మోహన్ రెడ్డి కేసులో… ఈడీ ఇంత వరకూ ఒక్క సారి కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close