ఏపీ అప్పలకు కేంద్రం కూడా సీక్రెట్‌గానే పర్మిషన్లు !

ఏపీ ప్రభుత్వం జీతాలు అందరికీ ఇవ్వలేదు. సగం మందికి కూడా వచ్చాయో లేదో క్లారీటీ లేదు.రేపు మంగళవారం ఆర్బీఐలో రూ. రెండు వేల కోట్ల అప్పు కోసం ఇండెంట్ పెట్టారు. అవి వస్తే చెల్లిస్తారు. అయితే లెక్క ప్రకారం ఇప్పటికే అప్పుల పరిమితి ముగిసిపోయింది. ఇంకా నాలుగైదు వేల కోట్లు ఎక్కువే తీసుకున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణకు కనీసం రూ. పదివేల కోట్ల వరకూ అప్పులకు చాన్సివ్వలేదు. కానీ ఏపీ ఖాతాలో మాత్రం ప్రతీ నెలా మంగళవారం రెండు వేల కోట్లు పడేలా చూసుకుంటోంది. కేంద్రం దానికి అనుమతి ఇస్తోంది.

గతంలో అదనపు అప్పులకు పర్మిషన్లు ఇచ్చినట్లుగా కేంద్రం బహిరంగంగా ప్రకటించేది. కానీ ఇప్పుడు కేంద్రం కూడా అలాంటి ప్రకటన చేయడం లేదు. ముసుగులో అప్పులకు పర్మిషన్ ఇస్తోంది. దాన్ని చూపి ఆర్బీఐ దగ్గర అప్పులు తెచ్చుకుంటోంది. కేంద్రం అదనపు రుణాలకు చాన్సివ్వకుండా.. ఏపీ అలా ఇండెంట్ పెట్టుకునే అవకాశం లభించదు. ఓ వైపు అప్పుల కుప్పగా రాష్ట్రం మారింది. బడ్జెట్‌లో చూపించిన లోటు .. ఐదు నెలల్లోనే కనిపిస్తోంది. అయినా కేంద్రం మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది.

రాజకీయంగా వైసీపీతో పోరాడుతున్నట్లుగా రాష్ట్ర నేతలు చెబుతూంటారు కానీ.. కనీసం నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం నడుచుకునేలా చూసే విషయంలోనూ ఒత్తిడి తేలేకపోతున్నారు. ఓ వైపు అప్పుల భారం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోంది. మరో ఇరవై, ముఫ్పై ఏళ్ల వరకూ కట్టుకునేలా ఇప్పుడు అప్పులు చేశారు. ఆదాయం పెంచే మార్గాలు కూడా లేవు. ఈ కారణంగా ఆదాయం పెరగదు కానీ కట్టాల్సిన అప్పులు మాత్రం కట్టుదాటిపోతాయి. వైసీపీతో స్నేహం కోసం బీజేపీ… రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదన్నట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close