ఏపీపై కేంద్రం చల్లని చూపు.. మరో రూ. పదివేల కోట్ల లోన్‌కు ఓకే..!

అప్పులు దొరక్కపోతే బండి నడిచే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వ పెద్దలు అప్పుల పరిమితి పెంచుకో వడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది తీసుకోవాల్సిన రుణాల పరిమితి ముగిసిపోయింది. రూ. వెయ్యి కోట్లు మాత్రమే పెండింగ్ ఉంటే దాన్ని గత వారం తీసేసుకున్నారు. ఆ తర్వాత పరిమితి పెంపు కోసం బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో అదే పనిగా సమావేశమయ్యారు. రాజకీయంగానూ తమ వంతు ప్రయత్నాలు చేశారు. వారి కృషి ఫలించింది. కేంద్రం చల్లని చూపు చూసింది.

ఏపీ డిసెంబర్ వరకూ మరో రూ. 10500 కోట్ల అప్పును తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చామంటూ రిజర్వ్ బ్యాంక్‌కు సమాచారం పంపింది. సోమవారమే ఈ సమాచారం అర్బీఐకి చేరినట్లుగా తెలియగానే వెంటనే ఏపీ ప్రభుత్వం మంగళవారం రిజర్వ్ బ్యాంకులో బాండ్లు అమ్మకానికి పెట్టేసింది. 18 ఏళ్లకు రూ. వెయ్యి కోట్లు.. 20 ఏళ్లకు రూ. వెయ్యి కోట్లు అప్పు తెచ్చుకునేందుకు ఇండెంట్ పెట్టింది. దీంతో ఈ నెల గండం గట్టెక్కడానికి అవకాశం ఏర్పడింది. అప్పుల విషయంలో కేంద్రం కాస్త టెన్షన్ పెడుతున్నా.. చివరికి సహకరిస్తూండటంతో ఏపీ ప్రభుత్వంలోనూ కాస్త ధీమా ఉంది.

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. అప్పుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాదని.. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా చేతులెత్తేసే అవకాశం ఉండదన్న అంచనాలో ఉన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రధానమైన టాస్క్ అప్పులకు అనుమతులు సాధించడమే. ఆ పనిని ఆయన సమర్థంగా నిర్వహిస్తున్నారు. నెలలో పదిహేను రోజుల వరకూ ఢిల్లీలో ఉంటున్నప్పటికీ.. ప్రభుత్వ ఆర్థిక కష్టాలు మాత్రం తీర్చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close