టీడీపీ అభ్యర్థుల ఆర్థిక దిగ్బంధం ఖాయం..! ఇక ఐటీ రెయిడ్స్ సీజన్..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త తరహా రాజకీయం జరుగుతోంది. టీడీపీ అభ్యర్థులతో పోటీ నుంచి విరమింప చేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నామినేషన్ల గడువు చివరికి వచ్చింది. ఇప్పటికీ.. దాదాపుగా పది మంది టీడీపీ అభ్యర్థులపై కొన్ని శక్తులు గురి పెట్టాయని చెబుతున్నారు. నామినేషన్లు వేసిన తర్వాత ఉపసంహరించుకునేలా చేయడమో… లేకపోతే ఆజ్ఞాతంలోకి వెళ్లడమో చేసి.. టీడీపీని నైతికంగా దెబ్బకొట్టాలన్న ఆలోచన చేస్తున్నారంటున్నారు. అన్నింటికీ తెగించి… పోటీకి సిద్ధమైన వారిపై.. ఇన్‌కంట్యాక్స్ దాడులు జరుగుతాయనే ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా.. ఇదే మాట చెబుతున్నారు. విజయనగరం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన… టీడీపీ అభ్యర్థులపై ఐటీ దాడులు జరిపేందుకు సిద్ధమవుతున్నారని మండి పడ్డారు.

కర్ణాటక ఎన్నికల సమయంలో ఓ వంద మందికిపైగా ఐటీ బృందం.. అక్కడ మకాం వేసింది. ఒక్కరంటే.. ఒక్క బీజేపీ నేత ఇంటిపైనా.. ఆ ఐటీ బృందం దాడి చేయలేదు. కానీ.. కాంగ్రెస్ నేతల్లో ఏ ఒక్కరినీ వదిలి పెట్టలేదు. చివరికి ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య బస చేసిన ఓ రిసార్ట్‌లోనూ సోదాలు చేశారు. ఆ తర్వాత తమిళనాడులో పెద్ద ఎత్తున సోదాలు చేశారు. రాజకీయంగా లొంగని వారిని ఆ దాడులతో దారిలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే చేస్తారని..ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే… విజయనగరం జిల్లాతో పాటు మరో చోట.. టీడీపీలో కీలకంగా వ్యవహరించే నేతల ఇళ్లలో సోదాలు జరిగాయి. ముందు ముందు ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది.

సాధారణం అధికార పార్టీ అంటే… ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ.. ఏపీలో టీడీపీ పరిస్థితి అలా లేదు. అధికారం చేతిలో ఉన్నా… ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొంటోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా.. ధీమాగా ఉండాల్సిన వారు.. రాష్ట్రం బయట నుంచి వస్తున్న హెచ్చరికతో కూడిన సూచనల్లాంటి సలహాలతో ఉక్కిరిబిక్కిరయిపోతున్నారు. కానీ అధికారపక్షం ఎంత దిలాసాగా ఉండాలో.. ప్రతిపక్షం అంత హాయిగా ఉంటోంది. వారిపై ఎలాంటి ఐటీ దాడుల హెచ్చరికలు లేవు. వారి అభ్యర్థులపై ఒత్తిళ్లు కూడా లేవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close