ఆత్మీయ ఆహ్వానం

ఇద్దరు చంద్రులూ భేటీ అయ్యారు. ఎనిమిది నెలల తర్వాత ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఏపీ రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ ను ఆహ్వానించడానికి చంద్రబాబు స్వయంగా బేగంపేటలోని తెలంగాణ సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు. అక్కడ చంద్రబాబు రాక కోసం ఎదురు చూస్తున్న కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఆదివారం సాయంత్రం 6.20కి కేసీఆర్ తో చంద్రబాబు అపాయింట్ మెంట్. అయితే 6.35కు చంద్రబాబు చేరుకున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు రమణ, ఎర్రబెల్లితో కలిసి చంద్రబాబు కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్లారు. కేసీఆర్ తనయకుడు కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులు బాబుకు సాదరంగా స్వాగతం పలికారు.

కేసీఆర్ ను చంద్రబాబు శాలువాతో సత్కరించారు. ఆహ్వాన పత్రిక అందించారు. తిరుపతి ప్రసాదం అందించారు. రాజధాని శంకుస్థాపనకు రావాలంటూ ఆత్మీయంగా ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 55 నిమిషాల పాటు వీరు మాట్లాడుకున్నారు. అమరావతి నిర్మాణ ప్లాన్, విద్యుత్, నీటి ప్రాజెక్టులు ఇతర అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. నది ఒడ్డున రాజధాని శంకుస్థాపన శుభప్రదమని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. దసరా నాడు ఆ కార్యక్రమానికి హాజరు కావాలని కూడా కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్య వాతావరణంలో కలుసుకోవడం ఇరు రాష్ట్రాలకూ మంచిదనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టయినప్పటి నుంచీ తెలంగాణలో తెరాస, టీడీపీ మధ్య వైరం మరింత పెరిగింది. చివరకు చంద్రబాబుకు నోటీసు ఇస్తారని, తీవ్రమైన చర్య తీసుకుంటారని ప్రచారం జరిగింది. ఈ కేసులకు కౌంటర్ గా ఏపీలోనూ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చంద్రుల మధ్యా పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల శాంతి సామరస్య సాధనకోసం వచ్చినట్టు అయింది. రెండు రాష్ట్ర్రాలూ పరస్పరం సహకరించుకుంటే కలిసిమెలిసి మరింత వేగంగా అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close