ఎడిటోరియల్ – తెలుగుదేశం పార్టీకి గుణపాఠం..! చంద్రబాబుకు ఇది పరీక్షా సమయం..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టకుని తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్ మెరుగైన స్థానాలు సాధించి… టీడీపీ ఘోరపరాజయం పాలైనా.. పెద్దగా అప్రతిష్ట ఉండేది కాదు కానీ.. రెండు పార్టీలు మట్టి కొట్టుకుపోయాయి. ప్రజల్లో పొత్తుకు యాక్సెప్టెన్సీ రాలేదన్న విషయం స్పష్టమైపోయింది. అదే సమయంలో.. చంద్రబాబు ప్రమేయాన్ని తెలంగాణ ప్రజలు ఏ మాత్రం అంగీకరిచేందుకు సిద్ధంగా లేదన్న విషయం మరోసారి స్పష్టమయింది.

తెలంగాణ ఎన్నికలకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది..?

తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చిన.. సెప్టెంబర్ ఆరో తేదీన అసెంబ్లీని రద్దు చేసేటప్పటికీ.. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు అన్న ప్రస్తావన ప్రాథమిక దశలోనే ఉంది. అయితే టీఆర్ఎస్‌తో లేకపోతే ఒంటరిగా వెళ్లాలన్న ఆలోచనలోనే టీడీపీ అప్పటి వరకూ ఉంది. కానీ.. జాతీయ రాజకీయ పరిణామాలకు ముడి పెట్టేసి… దశాబ్దాలుగా ఏ పార్టీతో అయితే పోరాడారో.. ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్‌పై పోరాడటానికి.. తెలంగాణ టీడీపీ నేతలతా.. ఈ పొత్తునకు సిద్ధమయ్యారు. అయితే.. అది అక్కడి వరకూ వదిలేయకుండా.. చంద్రబాబు దీన్ని ఎక్స్‌ట్రీమ్ రేంజ్‌కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది..? వారం రోజుల పాటు ప్రచారం చేసి… కేసీఆర్‌పై అదే పనిగా విమర్శలు చేస్తూ.. హైదరాబాద్ అంతా.. తన వల్లే అభివృద్ధి చెందిందని .. పదే పదే చెప్పుకోవడం ఎందుకు..? అది తెలంగాణ ప్రజల సెంటిమెంట్లను దెబ్బతీస్తుందని అంచనా వేయలేకపోయారా..? తెలంగాణలో ఎలాంటి రాజకీయ ఆసక్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేని సందర్భంలో.. చంద్రబాబు అత్యంత రిస్క్ తీసుకుని… ఎన్నికలను.. కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా మార్చుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది. గెలిస్తే.. వచ్చే పాజిటివ్ వేవ్ గురించే ఆలోచించారు కానీ.. ఎలాంటి రాజకీయ ఆసక్తులు లేని రాష్ట్రంపై…అంతగా అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం ఏముంది..?

తెలంగాణ ఇచ్చిన సోనియానే పట్టించుకోలేదు.. చంద్రబాబు ఎంత..?

తెలంగాణ ఎన్నికల ఫలితం కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓ గుణపాఠం. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ కానీ.. చంద్రబాబు కానీ.. ఎప్పుడూ మేలే చేశారు. ఆ విషయం అక్కడి ప్రజలకూ తెలుసు. ఓటర్లకూ తెలుసు. అంత ఎందుకు.. తెలుగుదేశం పార్టీని… చంద్రబాబును తెలంగాణకు అత్యంత బద్ధశత్రువుగా చూపిస్తున్న కేసీఆర్‌కూ.. తెలుసు. కానీ.. రాజకీయం అంటే అదే. తాము తప్ప.. అందరూ .. ప్రజల్ని పీడించుకు తినేవాళ్లని చెప్పడమే లక్ష్యం. దీన్ని తిప్పికొట్టగలిగితేనే రాజకీయం. కానీ.. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న రాజకీయం.. కేసీఆర్ చేస్తున్న రాజకీయానికి పొసిగేది కాదు. నేను సైబరాబాద్ ను అభివృద్ధి చేశాను … బీసీలకు మేలు చేశాం.. ఓట్లేయండి.. అంటే.. వినేవాళ్లు ఎవరు ఉంటారు…? దశాబ్దాల స్వరాష్ట్ర కల నేరవెర్చిన సోనియానే పట్టించుకోని తెలంగాణ ప్రజలు.. అభివృద్ధి చేశాను.. ఆదరించమంటే.. ఎట్లా ఆదరిస్తారు…?

కేసీఆర్ విజయం నేర్పే పాఠాలేమిటో నేర్చుకుంటారా..?

తెలంగాణలో కేసీఆర్ సాధించిన అనితర సాధ్యమైన విజయంతో అయినా చంద్రబాబు… కళ్లు తెరవాల్సి ఉంది. జాతీయ రాజకీయాల పేరుతో అనవసరమైన వ్యవహారాలపై దృష్టి పెట్టి.. సొంత బేస్‌ను నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది. నంద్యాల ఉపఎన్నికలతో వచ్చిన వేవ్ ఎంత ఉందో.. అది మొత్తం.. పొరుగు రాష్ట్రంలోని పరాజయాలతో తుడిచి పెట్టుకుపోయినట్లే. ఇప్పుడు మళ్లీ కొత్తగా.. ఆరు నెలల్లోపు జరిగే.. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో.. జీరో నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలవరం సహా.. ప్రధానమైన ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు సమర్థంగా ప్రజలకు చేరే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు సంక్షేమ పథకాలను ప్రకటించడమే కాదు.. దాన్ని క్షేత్ర స్థాయి ప్రజలకు అందేలా చూసి.. వాటి నుంచి.. ఓట్లను పొందే ప్రయత్నాలు కూడా చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత కూడా.. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులను ఓటర్లుగా మార్చుకునే వ్యూహాన్ని సిద్దం చేసుకోవాల్సి ఉంది.

ప్రజల ఆలోచనలకు తగ్గట్లే రాజకీయం చేయాలి…!

పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు. ఓడిపోయినవాడెప్పుడూ.. చేతకానివాడు కాదు. తెలుగుదేశం పార్టీకి కూడా ఇది వర్తిస్తుంది. కానీ.. జరిగిన తప్పులను ఎప్పటికప్పుడు.. సరి చేసుకుంటూ పోతేనే..ఓటములు మళ్లీ మళ్లీ ఎదురు కావు. ఈ విషయంలో చంద్రబాబునాయుడు.. పక్కా పర్ఫెక్ట్. కాబట్టే.. ఇంత కాలం టీడీపీని సమర్థంగా నడిపించగలుగుతున్నారు. ఇప్పుడీ తెలంగాణ పరాజయంలోనూ.. ఆయన పాఠాలు నేర్చుకుంటారు. అయితే.. అవి మారుతున్న రాజకీయానికి అనుగుణంగా ఉంటాయా.. లేక పాత పద్దతిలోనే ఉంటాయా అన్నది కీలకం. .” నేను అభివృద్ధి చేశా… ప్రజల సంక్షేమం చూశా.. తెలుగు ప్రజలకు భవిష్యత్ ను నిర్మించడానికి కష్టపడ్డానని..” చెప్పుకుంటే… ఆదరించడానికి ప్రజలు సిద్దంగా లేరు. ఆ విషయం తెలంగాణ ఫలితంతో తేటతెల్లమైంది. దానికి తగ్గట్లుగానే చంద్రబాబు వ్యూహం సిద్దం చేసుకోవాలి. లేకపోతే.. గడ్డు కాలమేనని… తెలంగాణ ఫలితం తేల్చి చెప్పింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close