మ‌రికొన్ని ప‌థ‌కాల ప్ర‌క‌ట‌న త‌రువాతే అసెంబ్లీ స‌మావేశాలు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు ఈనెల 30 నుంచి వ‌చ్చే నెల 7 వ‌ర‌కూ వారం పాటు జ‌రుగుతున్నాయ‌ని ముందుగా ప్ర‌క‌టించారు. కానీ, ఇప్పుడా తేదీల్లో చిన్న మార్పు చేస్తూ… వ‌చ్చే 4 నుంచి 11 వ‌ర‌కూ సమావేశాలు జ‌రుగుతాయి. తేదీల మార్పు వెన‌క రాజ‌కీయ కార‌ణాలేవీ లేవుగానీ… కొన్ని సాంకేతిక అంశాలున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే పెన్ష‌న్ల‌ను రూ. 2 వేల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా పెన్షన్లు పెంచుతున్న‌ట్టు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. ఈ రెట్టింపు పెన్ష‌న్ల‌ను వ‌చ్చే నెల నుంచే పంపిణీ చేస్తున్నారు. ఈ ప‌థ‌కాన్ని మ‌రింత విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంతోపాటు, స‌మ‌ర్థంగా అమ‌లుచేసి తీరాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఉంది.

వ‌చ్చే నెల 1 నుంచి 3 వ‌ర‌కూ మూడు రోజుల‌పాటు ఈ పెన్ష‌న్లకు సంబంధించిన అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలంటూ ఎమ్మెల్యేలందరికీ ముఖ్య‌మంత్రి ఆదేశించారు. కాబట్టి, ఎమ్మెల్యేలంతా స్థానికంగా వారివారి సొంత నియోజ‌క వ‌ర్గాల్లో గ్రామాల్లో ఉండాల్సిన ప‌రిస్థితి ఉంది. కాబ‌ట్టి, 30 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు పెట్టుకుంటే… స్థానికంగా గ్రామ‌స్థాయికి వెళ్లే ఎమ్మెల్యేలు ఎవ్వ‌రూ ఉండ‌రు. అందుకే, స‌మావేశాల‌ను 4కి వాయిదా వేశార‌ని తెలుస్తోంది. దీంతోపాటు, రాబోయే కొద్దిరోజుల్లో మ‌రిన్ని ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించే దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆలోచిస్తోంద‌ని స‌మాచారం. సోమవారం జరగనున్న మంత్రి మండలి సమావేశాల్లో రైతులకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తీసుకునే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.

రాబోయే అసెంబ్లీ స‌మావేశాలు చివరివి కాబోతున్నాయి కాబ‌ట్టి, వీట‌న్నింటినీ చెప్పుకునేందుకు వీలుగానే స‌భా నిర్వ‌హ‌ణ తేదీల‌ను మార్చుకున్న‌ట్టు చెప్పొచ్చు. ఎన్నిక‌ల‌కు వెళ్లే స‌మ‌యం వ‌చ్చేసింది కాబ‌ట్టి… ఇంత‌వ‌ర‌కూ టీడీపీ ప్ర‌భుత్వం చేసిన పాల‌న‌పై, అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌పై, తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల‌పై స‌వివ‌రంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇంకోప‌క్క‌, చివ‌రి స‌మావేశాలైనా కూడా ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యులు స‌భ‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close