అంతులేని చంద్రన్న సంక్షేమం..! 18 ఏళ్లకే నిరుద్యోగ భృతికి సై ..!

ఇంటర్మీడియట్‌తోనే చదువులు ఆపేస్తున్న వారిని ఆదుకుంటామంటూ.. టీడీపీ కొత్త హామీని రెడీ చేసింది. నిరుద్యోగ భృతి అర్హత వయసు 18 ఏళ్లకు తగ్గించేందుకు రెడీ అవుతోంది. ఈమేరకు మేనిఫెస్టో కూడా సిద్ధం చేస్తోంది. ఎన్నికల ప్రచారసభల్లో చంద్రబాబు కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ అధికారంలోకి రాగానే 2వేల రూపాయల భృతిని మూడు వేలకు పెంచేందుకు సిద్ధమని అంటోంది. మళ్లీ అధికారంలోకి వస్తే.. యువనేస్తం పథకం ఇచ్చే నిరుద్యోగ భృతిని 18ఏళ్లకే ఇచ్చేందుకు.. అది కూడా 2 వేల నుంచి 3 వేలకు పెంచేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు తన మేనిఫెస్టోలో హామీని పొందుపరుస్తోంది. ఇంటర్మీడియెట్‌తోనే చదువు ఆపేస్తున్న వారికి కూడా యువనేస్తం ద్వారా ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

నిరుద్యోగభృతి కోసం దరఖాస్తు చేయాలంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం కనీసం 23 ఏళ్ల వయసుండాలి. ఆ పరిమితిని తగ్గించడంతోపాటు పలు ఆకర్షణీయ హామీలను మేనిఫెస్టోలో ప్రకటించనుంది. యువతకు ఉద్యోగాల కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహాలోనే రాష్ట్రంలో కూడా ఏపీపీఎస్సీ ద్వారా ఏటా నియామకాల నోటిఫికేషన్లు ఇస్తామని, నియామకాల కేలండర్‌ను విడుదల చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించనుంది. ఇందుకోసం ఏటా మార్చి 31నాటికి ప్రతి ప్రభుత్వ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే జాబితా సిద్ధం చేస్తారు. ఏప్రిల్‌ తొలివారంలో ఏపీపీఎస్సీకి పంపిస్తారు. ఏపీపీఎస్సీ వాటి భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. నిరుద్యోగ యువతకు పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం ఇచ్చి పరీక్షలు పెడతారు. ఏటా నోటిఫికేషన్లు ఇస్తారు కాబట్టి ముందు నుంచే ప్రణాళిక ప్రకారం సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది.

నిరుద్యోగ భృతిని 3 వేలకు పెంచితే.. ఉద్యోగం వచ్చేవరకూ సొంత ఖర్చులకు తల్లిదండ్రులపై ఆధారపడే అవసరం యువతకు ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవైపు నిరుద్యోగ భృతి ఇస్తూనే.. వారు ఉద్యోగం, ఉపాధి సంపాదించుకునేందుకు అవసరమైన నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తే ఇటు యువతకు అవకాశాలు రావడంతో పాటు ఉద్యోగ యంత్రాంగంలో కొత్త రక్తం వస్తుందని భావిస్తున్నారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఇది ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ మేరకు హామీలను మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఓసీలతో సహా విద్యార్థులందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రస్తుతం 4 వేల నుంచి 14 వేల దాకా ఇస్తున్న పాకెట్‌ మనీని భారీగా పెంచాలని సీఎం నిర్ణయించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close