చంద్రబాబు లేఖ రాసేశారు..! ఇప్పుడేం జరుగుతుంది..?

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ రాయలేదని వైసీపీ నేతలు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. లేఖ రాస్తే జైల్లో పెడతారని భయమా.. అని ప్రశ్నించారు. తమ నేత లేఖ రాశారని కూడా గుర్తు చేశారు. అయితే చంద్రబాబు వాళ్ల మాటలను పట్టించుకున్నారో లేక వ్యూహాత్మకంగా కొద్ది రోజులు ఆలస్యం చేశారో కానీ ఆదివారం ప్రధాని మోడీకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని లేఖ పంపేశారు. అందులో… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఏం చేయాలో కొన్ని సూచనలు చేశారు. వాజ్ పేయి హయాంలో.. ఇలానే స్టీల్ ప్లాంట్ కు ఇబ్బందికర పరిస్థితులు వస్తే అప్పట్లో… కేంద్రం ..దాదాపుగా పదమూడు వందల కోట్లు కేటాయించి.. కాపాడిందని.. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే పనిచేయాలని చంద్రబాబు కోరారు.

చంద్రబాబు లేఖ రాయడం అన్నది చాలా కామన్. కానీ ఆ విషయాన్ని ఉమ్మడి రాష్ట్ర విభజనకు లేఖ ఇవ్వడం అన్నంతగా వైసీపీ సీన్ క్రియేట్ చేసింది. దానికి తగ్గట్లుగా ఆయన ఆగి ఆగి లేఖ రాశారు. ఇప్పుడు.. వైసీపీ నేతలకు విమర్శించడానికి ఏమీ లేకుండా పోతుంది. ఇప్పుడు టీడీపీ నేతలు అధికార పార్టీ హోదాలో.. గతంలో ప్రత్యేకహోదా కోసం టీడీపీ పోరాడినట్లుగా వైసీపీ నేతలు పోరాడాలని సవాల్ చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయడం… ప్రధాని ఇంటిని ముట్టడించడం వంటివి చేయాలని సవాల్ చేస్తున్నారు. కానీ.. వైసీపీ నేతలు మాత్రం.. నోరు మెదిపే పరిస్థితి లేదు. వారు విశాఖలోనే పాదయాత్రల్లో పాల్గొంటున్నారు. అవి కార్పొరేషన్ ఎన్నికల ప్రచార పాదయాత్రల్లానే ఉన్నాయి కానీ… స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్నట్లుగా లేవు.

నిజానికి లేఖలు.. అసెంబ్లీ తీర్మానాల వల్ల పావలా ప్రయోజనం కూడా ఉండదని రాజకీయవర్గాలకు తెలుసు. కార్మిక సంఘాలతో సమావేశమైనప్పుడు సీఎం జగన్ కూడా… తాను లేఖ రాసి… ఫిఫ్టీన్ డేస్ అంటే పదిరోజులు గడిచినప్పటికీ.. ఎలాంటి రిప్లై రాలేదని చెప్పుకొచ్చి ఆవేదన చెందారు. ఇదంతా చంద్రబాబు మొదటి ఐదేళ్లు అనుభవించారు కాబట్టి రిప్లయ్ వస్తుందని కూడా ఆయన అనుకోరు. స్టీల్ ప్లాంట్ కోసం రాజకీయాలు చేస్తూ.. అన్ని పార్టీలు టైం పాస్‌ చేస్తున్నాయి కానీ.. చిత్తశుద్ధితో… ఉద్యమాలు మాత్రం చేయడం లేదన్న అభిప్రాయం మాత్రం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close