చిరు టైటిల్ ఇదే.. కన్‌ఫామ్‌

ఇంకొద్ది గంట‌ల్లో చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. చిరు ఎలా ఉండ‌బోతున్నాడా అంటూ అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. టైటిల్ ఏమిటి?? అనే ఉత్కంఠ‌త కూడా ఉంది. అయితేచిరు సినిమాకి ఖైదీ నెం.150 అనే పేరు క‌న్‌ఫామ్ చేసేశార‌ని తెలుస్తోంది. చిరుకి ఖైదీ సినిమా స్టార్‌డ‌మ్ తెచ్చిపెట్టింది. ఖైదీ నెం.786 సూప‌ర్ హిట్ అయ్యింది. ఇది చిరు 150వ‌సినిమా. సో.. అన్ని సెంటిమెంట్లూక‌ల‌సి ఈ టైటిల్ వైపే మొగ్గు చూపేలా చేశాయ‌ని టాక్‌. నెపోలియ‌న్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చినా… ఆ టైటిల్ మ‌రొక‌రి ద‌గ్గ‌ర ఉండిపోయింది. చివ‌రికి ఖైదీ నెం.150 ఖాయ‌మైన‌ట్టు టాక్‌. టైటిల్ లోగో కూడా రేపు చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి.

అభిమానుల కోసం శిల్ప‌క‌ళావేదిక‌లో ఫ‌స్ట్ లుక్ లాంఛ్ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింది. ఈ వేడుక‌లో చిరు పాల్గొన‌డం లేదు. అయితే మిగిలిన మెగా హీరోలు, వినాయ‌క్ క‌ల‌సి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేస్తారు. దాంతో పాటే మేకింగ్ వీడియోనీ విడుద‌ల చేసే ఆలోచ‌న‌ల్లో ఉంది చిత్ర‌బృందం. టీజ‌ర్‌ని చూపించాల‌న్న ఆలోచ‌న వ‌చ్చినా, దానికి త‌గినంత స‌మ‌యం దొర‌క్క‌పోవ‌డంతో ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకొంది. చిరు 150 సినిమాల చ‌రిత్ర‌నీ ఓ వీడియోలో పొందుప‌రిచర్ట‌. దాన్ని కూడా అభిమానుల స‌మ‌క్షంలో విడుద‌ల చేయ‌నున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ...

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close