బోయపాటికి చిరు ‘లైన్’ క్లియర్

చిరంజీవి మూడ్ పూర్తిగా సినిమాల‌వైపు ట‌ర్న్ అయ్యింది. 150వ సినిమా చేయాలా, వ‌ద్దా.. చేస్తే ఎవ‌రితో అనే విష‌యాల్ని నాలుగేళ్లు ఆలోచించిన చిరు 151వ సినిమా కోసం మాత్రం ముందు నుంచీ జాగ్రత్త ప‌డిపోతున్నాడు. 151వ సినిమా గీతా ఆర్ట్స్‌లో అన్నది ఎప్పుడో ఖాయ‌మైపోయింది. అందుకోసం క‌థ‌లు వినే బాధ్యత చిరు.. అల్లు అర‌వింద్‌కి అప్పగించాడు. అర‌వింద్ కూడా నెల రోజులు నుంచీ అదే ప‌నిలో ఉన్నాడు. చివ‌రాఖ‌రికి బోయ‌పాటితో సెట్టయ్యింది. స‌రైనోడుతో గీతా ఆర్ట్స్ కి భారీ విజ‌యాన్ని అందించిన బోయపాటినే చిరు 151వ సినిమాకి ద‌ర్శకుడిగా ఫిక్సయ్యాడు. రెండ్రోజుల క్రితం అర‌వింద్‌కి బోయ‌పాటి ఓ లైన్ చెప్పార‌ట‌. అది అర‌వింద్‌కి బాగా న‌చ్చింద‌ని, వెంట‌నే చిరుతో భేటీ వేశార‌ని తెలుస్తోంది.

మంగ‌ళ‌వారం రాత్రి బోయ‌పాటి – చిరు – అల్లు అర‌వింద్‌ల మ‌ధ్య ఈ క‌థ గురించి గంట‌సేపు చ‌ర్చ న‌డిచింద‌ని, బోయ‌పాటి చెప్పిన లైన్ చిరుకీ బాగా న‌చ్చింద‌ని తెలుస్తోంది. 151వ సినిమాగా దాన్నే ఫిక్స్ చేసిన చిరు లైన్‌కి స్ర్కిప్టుగా మార్చే ప‌నిలో ఉండ‌మ‌ని బోయ‌పాటికి సూచించాడ‌ట‌. అందుకు సంబంధించిన అడ్వాన్సులు కూడా ఇచ్చి పుచ్చుకోవ‌డం జ‌రిగిపోయాయి. బెల్లంకొండ శ్రీ‌నివాస్ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా త్వర‌లోనే ప‌ట్టాలెక్కబోతోంది. అది పూర్తయిన వెంట‌నే చిరు – బోయ‌పాటిల సినిమా మొద‌ల‌య్యే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. ప‌వ‌న్ – దాస‌రి సినిమాకు బోయ‌పాటి నో చెప్పి, వెంట‌నే చిరుతో సై అన‌డం మెగా ఫ్యాన్స్‌ని ఆశ్చర్యంలో ముంచెత్తే అంశ‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close