గుండు కాద‌ది.. మేక‌ప్ నిపుణుల మాయ‌

ఈమ‌ధ్య చిరంజీవి గుండుతో క‌నిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈలుక్ ఏ సినిమా కోసం? అంటూ అంతా ఆస‌క్తిగా ఆరాలు తీశారు. ఇది ఓ వెబ్ సిరీస్ కోస‌మ‌ని కూడా ప్ర‌చారం సాగింది. ఆచార్య షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గా.. చిరు ఇప్పుడెందుకు ఇంత అర్జెంటుగా గుండు గీయించుకున్నారు? అనే అనుమానాలూ వ‌చ్చాయి. అయితే ఆ గుండు వెనుక ఉన్న ర‌హ‌స్యాన్ని చిరు చెప్పేశారు. నిజానికి అది గుండు కాదు. గుండులాంటి గుండు. మేక‌ప్ మాయ‌. మేక‌ప్ నిపుణులు చిరు లుక్‌ని అలా… మార్చేశారంతే. ఈ మొత్తం త‌తంగాన్ని చిరు ఓ వీడియో రూపంలో త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టేశారు. `ఇదే సినిమా మ్యాజిక్‌` అంటూ.. ఆ ర‌హ‌స్యాన్ని విప్పేశారు. మ‌రోవైపు `ఆచార్య‌` కొత్త షెడ్యూల్ కోసం రంగం సిద్ధ‌మ‌వుతుందని టాక్‌. వ‌చ్చే నెల‌లో `ఆచార్య‌` షూటింగ్ పునః ప్రారంభం కాబోతోంది. అయితే ముందుగా రామ్ చ‌ర‌ణ్ షెడ్యూల్ ని పూర్తి చేసే అవ‌కాశం ఉంది. ఆ త‌ర‌వాతే.. చిరు సెట్లో అడుగుపెడ‌తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close