సమ్మర్ వార్ కు సై అంటున్న ఇద్దరు..!

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలంటే పండుగకు పోటీ పడటం కామనే.. కాని మన హీరోలు కొందరు సమ్మర్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు రిలీజ్ చేస్తారు. సమ్మర్ అంటే దాదాపు స్టూడెంట్స్ కి హాలీడేస్ కాబట్టి ఆ టైమ్లో మంచి సినిమాను అందిస్తే దాన్ని కాస్త హిట్ చేసి పెడతారని వారి ఆలోచన. ప్రతీసారి పండుగ సీజన్లనే కాకుండా సమ్మర్ వార్ కూడా స్టార్ హీరోల మధ్య కామన్ అయ్యింది.

అయితే ఈసారి సమ్మర్ వార్ కి సిద్ధమవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న అడ్డాల శ్రీకాంత్ మరోసారి మహేష్ తో బ్రహ్మోత్సవంగా వస్తున్నాడు. తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక అదే డేట్ కి ఒకరోజు ముందు అంటే ఏప్రిల్ 7న బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సరైనోడు కూడా వస్తున్నాడు. అటు లెజెండ్ హిట్ తో బోయపాటి శ్రీను, రుద్రమదేవి హిట్ తో బన్నీ మంచి జోష్లో ఉన్నారు. ఇప్పుడు అదే జోష్ తో సరైనోడు సినిమా చేస్తున్నారు. మరి సమ్మర్ వార్ లో పోటీ పడుతున్న వీరిద్దరిలో నెగ్గేదెవరో సినిమాలు వస్తేనే గాని చెప్పలేం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close