“యాగం” మోడ్‌లో కేసీఆర్..! ఐదు రోజులు అంతే..!

తెలంగాణ సీఎం కేసీఆర్ .. ఎర్రవెల్లి గ్రామంలో ఉన్న తన ఫార్మ్ హౌస్‌లో చతుర్వేద మహారుద్ర సహిత సహాస్త్ర చండీయాగాన్ని ప్రారభించారు. ఐదు రోజుల పాటు ఈ యాగం జరుగుతుంది. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో.. 200 మంది రుత్వికులు యాగం నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద యాగశాలలు ఏర్పాటు చేశారు. ఏ పని ప్రారంభించినా…కేసీఆర్ ముందుగా యాగం చేస్తారు. అలా చేయడం వల్ల తన పని విజయవంతం అవుతుందని నమ్ముతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు ప్రారభించినప్పటి నుంచి ఆయన యాగాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ యాగాలు.. తరచూ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించే ముందు కూడా రాజశ్యామల యాగం నిర్వహించారు. అధికారం అందుకున్నారు.

జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ఇటీవలి కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌ పేరుతో ఓ ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. కలసి నడిచేందుకు ఇతర పార్టీలు పెద్దగా ముందుకు రావడం లేదు. అందుకే… కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల మనసు మార్చి.. అందరూ ఫెడరల్ ఫ్రంట్ వైపు వచ్చి.. ఫెడరల్ ఫ్రంట్ భారీ సక్సెస్ అయ్యాలా.. ఆయన ఈ యాగం చేస్తున్నారని.. సన్నిహితులు చెబుతున్నారు. కేసీఆర్ ఐదు రోజుల పాటు యాగంలో పాల్గొనే అవకాశం ఉంది.

200మంది రుత్విక్కులు అత్యంత నిష్టగా చేస్తున్న ఈ యాగ క్రతువును చూసేందుకు ప్రజ‌లను అనుమతించడం లేదని.. చెబుతున్నారు. అయితే చివరి రోజు మాత్రం.. ప్రజలను అనుమతించే అవకాశం ఉంటుందంటున్నారు. గతంలో… ఆయుత చండీయాగం నిర్వహించినప్పుడు.. అందర్నీ ఆహ్వానించారు. ఈ సారి ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి పాలన మాత్రం.. మరో ఐదు రోజుల పాటు ఫామ్‌హౌస్‌ నుంచే జరగనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close