దర్శకుడిగా ప్రియదర్శి!?

ప్రస్తుతం నటుడిగా ప్రియదర్శి ఫుల్ బిజీ. ఓ పక్క పెద్ద పెద్ద సినిమాల్లో కమెడియన్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. మరో పక్క `మిఠాయి`, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింది మల్లేశం బయోపిక్ `మల్లేశం`లో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో దర్శకుడిగా కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. ప్రియదర్శి స్నేహితుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. `పెళ్లి చూపులు`తో ప్రియదర్శికి బ్రేక్ ఇచ్చింది అతడే. ప్రస్తుతం `ఫ‌ల‌క్‌నుమా దాస్‌`లో పోలీస్‌గా, విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న సినిమాలో ప్రధాన పాత్రలో తరుణ్ భాస్కర్ నటిస్తున్నాడు.

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటిస్తున్న `మిఠాయి` ఆడియోకి అతిథిగా వచ్చిన తరుణ్ భాస్కర్ “నేను యాక్టర్ అయ్యానని ఏడిపిస్తున్నారు. ప్రియదర్శి త్వరలో డైరెక్టర్ కాబోతున్నాడు“ అన్నాడు. అతడు చెప్పేటప్పుడు కాదన్నట్టు సైగలు చేసిన ప్రియదర్శి, తరవాత స్పీచ్‌లో తరుణ్ భాస్కర్ మాటలను ఖండించలేదు. డైరెక్షన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నెల 22న విడుదలవుతున్న `మిఠాయి`కి వచ్చిన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే బాధ్యత తమదని, ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. నవ్విస్తామని ప్రియదర్శి అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖమ్మంలో టీడీపీని పోటీ చేయమంటున్న బీజేపీ !

ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో టీడీపీని పోటీ చేయాలని బీజేపీ కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో ప్రస్తుతం తిరుగులేని ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ బలహీనపడటంతో.. నామా నాగేశ్వరరావు నిలబడినా...
video

‘కంగువా’ గ్లింప్స్: ఓ స‌రికొత్త ప్ర‌పంచం

https://www.youtube.com/watch?v=ByCDEmNig7Q విజువ‌ల్ ఎఫెక్ట్స్ విలువెంతో, దాంతో ఏమేం చేయొచ్చో తెలిశాక‌.. వెండి తెర‌పై స‌రికొత్త ప్రపంచాల్ని సృష్టించ‌డానికి ద‌ర్శ‌కులు పోటీ ప‌డడం మొద‌లెట్టారు. ఆ కోవ‌లో శివ కూడా చేరిపోయాడు. యాక్ష‌న్ సినిమాల‌తో కెరీర్...
video

గ్లాసంటే సైజు కాదు… సైన్యం

https://www.youtube.com/watch?v=oZYqzxtg4f8 ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకొంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయి రాజ‌కీయ నాయ‌కుడి అవ‌తారం ఎత్తాడు. ఆయ‌న్నుంచి సినిమాల‌కు సంబంధించిన అప్ డేట్లు మ‌రో రెండు మూడు నెల‌ల వ‌ర‌కూ రావు......

మీడియా వాచ్ : యూటర్న్‌లో కల్ట్ చూపిస్తున్న ఎన్టీవీ

ఎన్టీవీలోని అపరిచితుడు బయటకు వచ్చేశాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పై.. రేవంత్ రెడ్డిపై.. బీఆర్ఎస్ కు ఇష్టం లేని నేతలపై.. వాళ్ల టార్గెట్ ను రీచ్ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close