ఎక్స్ ప్రెస్ రాజాకి అదే బలమట

అసలే పెద్ద సినిమాల యుద్ధంతో రసవత్తరంగా సాగబోతున్న సంక్రాంతి రేసులో నేను కూడా ఎక్స్ ప్రెస్ వేగంతో వస్తున్నా అంటూ దూసుకొస్తున్నాడు శర్వానంద్. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాతో ప్రేక్షకులను అలరించిన శర్వా మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఓ పక్క నందమూరి బాలకృష్ణ డిక్టేటర్, మరో పక్క యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో గా పోటీ పడుతుంటే సోగ్గాడే చిన్ని నాయనా అంటూ కింగ్ నాగార్జున తన ఖలేజా చూపించేందుకు వస్తున్నాడు.

అయితే వారి మధ్యలో కాస్త రిస్క్ అయినా సరే సినిమాను వదిలి హిట్ కొడతాం అంటూ నమ్మకంతో చెబుతున్నారు ఎక్స్ ప్రెస్ రాజా దర్శక నిర్మాతలు. దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా నైజాంలో బాగానే విడుదలయ్యే స్కోప్ ఉంది. ఇక సీడెడ్, కోస్తాంద్ర ఏరియాల్లో కూడా సాయి కొర్రపాటి విడుదలచేసేందుకు ముందుకు వచ్చాడట. యు.వి.క్రియేషన్స్ బ్యానర్లో మేర్లపాక గాంధి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కామెడీయే బలమని చెబుతున్నారు.

సినిమాలో కడుపుబ్బా నవ్వించే కామెడీ ఉంటే ఇక ఆ సినిమా సూపర్ హిట్ అన్నట్టే. ఆ నమ్మకంతోనే మూడు పెద్ద సినిమాల నడుమ ఈ చిన్న సినిమా విడుదల చేస్తున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమా విడుదల అయితేనే కాని శర్వానంద్ చేసిన కామెడీ ఆడియెన్స్ ని నవ్విస్తుందో లేక ఏడిపిస్తుందో తెలియదు.. ప్రస్తుతానికైతే సినిమా గురించి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడేలా ప్రమోషన్ చేయడంలో సక్సెస్ అయ్యారు దర్శక నిర్మాతలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close