ఇంకా ఆత్మవంచనే అయితే సాంతం మునుగుతారు!

చాలా మందికి కొన్ని రకాల బలహీనతలు ఉంటాయి. మీలో మీరు గుర్తించిన లోపాల గురించి చెబుతారా.. ‘అవును నాలో చాలా లోపాలున్నాయి. అందరినీ నమ్ముతాను. అందువల్ల చాలా నష్టపోతుంటాను’ అంటూ ఇండైరక్టుగా తమ గురించి తాము పొగిడేసుకుంటూ ఉంటారు. సాధారణంగా సినిమా సెలబ్రిటీల ఇంటర్వ్యూలో ఇలాంటి నయగారాల మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. రాజకీయాల్లో తక్కువ. కానీ… రాజకీయాల్లో కూడా ఆత్మవంచనకు మాత్రం కొదవేమీ ఉండదు. ప్రజలు తమను స్పష్టంగా తిరస్కరించి ఓడించారని తెలిసినా, గెలిచిన పార్టీ డబ్బు పంచింది, మద్యం పంపిణీచేసింది.. అంటూ ఆత్మ వంచన చేసుకునే నాయకులు మనకు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తారు. ఇప్పుడు ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా కూడా అలాంటి డైలాగులే వేస్తున్నారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో తమ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశాము గనుక.. నిప్పుడు అనుభవిస్తున్నాం అని.. దాని ఫలితాన్ని అనుభవిస్తున్నామని ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. అక్కడికేదో వారు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి ఉంటే.. ప్రస్తుతం యిరగదీస్తుండే వారు అన్నట్లుగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. పదేళ్లపాటూ పాలన సాగించిన పార్టీకి నిర్మాణం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం అంటే ఏమిటో బహుశా రఘువీరా ఒక్కరికే అర్థమయ్యే సంగతి.

అసలు విషయానికి వస్తే.. ఏపీలో కాంగ్రెస్‌ పరిస్థితి ఎందుకు దయనీయంగా ఉన్నదో పసిపిల్లవాడిని అడిగినా టక్కున చెప్పేస్తారు. రాష్ట్ర విభజనకు సంబంధించి, ఏపీ ప్రజలకు ఇష్టం లేని నిర్ణయం తీసుకున్నందుకు ఆ రాష్ట్రంలో వారి పతనం తలరాతగా మారింది. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర పీసీసీ నాయకులు ఆ వాస్తవాన్ని అంగీకరించకుంటే వారికే నష్టం జరుగుతుంది. చేసిన తప్పులు చెప్పుకుంటే పోతాయంటారు.. దాసుని తప్పులు దండంతో సరి అంటారు. కాంగ్రెస్‌ నేతలు కూడా, ఎట్‌లీస్ట్‌ ఏపీకి సంబంధించినంత వరకు, జనం వద్దకు వెళ్లిన ప్రతిసారీ విభజన చేసి తప్పు చేశాం… కనీసం కొత్త రాష్ట్రానికి ఉపయోగపడి మా పాపాన్ని కడిగేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని లెంపలు వేసుకుంటే తప్ప.. వారికి భవిష్యత్తు ఉండదు. పార్టీ నిర్మాణం.. కార్యకర్తలను విస్మరించాం.. లాంటి కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ ఆత్మవంచనతో పాటూ.. మీడియాను కూడా బురిడీ కొట్టించాలని అనుకుంటే.. ఆపార్టీ ఇక ఎప్పటికీ లేచి నిలబడడం అంటూ ఉండదని రఘువీరా తెలుసుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close