పీవీఆర్ మ‌ల్టీప్లెక్స్‌ల మూసివేత‌

క‌రోనా ఎఫెక్ట్ అంత‌కంత‌కూ ఎక్కువ‌వుతోంది. చాలా చోట్ల థియేట‌ర్లు మూత‌బ‌డుతున్నాయి. కేర‌ళ‌లో ఇప్ప‌టికే ‘బొమ్మ’ ప‌డ‌డం లేదు. క‌లెక్ట‌రు ఆదేశాల మేర‌కు నెల్లూరులోని థియేట‌ర్లు మూసి వేశారు. ఇప్పుడు పీవీఆర్ సినిమాస్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గేంత వ‌ర‌కూ పీవీఆర్ మ‌ల్టీప్లెక్స్‌ల‌ను తాత్కాలికంగా మూసి వేయాల‌ని యాజ‌మాన్యం నిర్ణ‌యించుకుంది. దిల్లీ, ఉత్త‌రాఖాండ్‌, జ‌మ్మూ – క‌శ్మీర్‌ల‌లో థియేట‌ర్లకు ఇప్ప‌టికే తాళాలు వేశారు. త్వ‌ర‌లోనే తెలుగు రాష్ట్రాల‌లోనూ ఈ నిర్ణ‌యం అమ‌లుకానుంది. హైద‌రాబాద్‌, విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి లాంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా మ‌ల్టీప్లెక్స్‌ల‌ను మూసేస్తే మంచిద‌ని తెలుగు ప్ర‌భుత్వాలు భావిస్తున్నాయి. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌ క‌లెక్ట‌ర్లు ఉత్త‌ర్వులు జారీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

వృద్ధుల ప్రాణాలతో రాజకీయం – ఇంత క్రూరమా ?

ఏపీ ప్రభుత్వానికి వృద్ధులను ఎంత హింసిస్తే అంత మంచి రాజకీయం అనుకుంటున్నారు. వాళ్లు ఎంత బాధపడితే అంతగా చంద్రబాబును తిట్టుకుంటారని ఊహించుకుంటూ వాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close