కేసీఆర్‌ మాటలకు ఎదురుచెప్పే వాళ్లూ ఉన్నారు!

తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు సంబంధించినంత వరకు కేసీఆర్‌ నాయకత్వం ఎంత తిరుగులేని మోనార్క్‌ నాయకత్వంగా ఆవిర్భవించిందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాటకు ఎదురుచెప్పగలవారు…. అటు ప్రతిపక్షాల్లో కూడా లేరు! అంతగా కేసీఆర్‌ ఇక్కడ తిరుగులేని పాలన సాగిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ నేతృత్వంలోని తెరాసకు లభిస్తున్న ప్రజాదరణ, ఎన్నికల్లో ఆ పార్టీ సాధిస్తున్న వరుస విజయాల నేపథ్యంలో.. ఆయన మాటకు ఎదురు చెప్పగల నాయకులు ఆ పార్టీలో ఉంటారని ఊహించడం కూడా భ్రమే అవుతుంది. అందుకే హైదరాబాదు కార్పొరేషన్‌ వంటి కీలక ఎన్నికల్లో కూడా మేయర్‌ విషయంలో కేసీఆర్‌ ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని వ్యతిరేకించే దమ్ము ఎవ్వరికీ లేకుండా పోయింది! కనీసం తాము కూడా ఆశిస్తున్నాం అంటూ తమ అసంతృప్తిని వెళ్లగక్కిన వారు కూడా లేరు! అంతగా ఏకస్వామ్య వ్యవస్థ ఆ పార్టీలో నడుస్తోంది.

అయితే ఖమ్మంలో మాత్రం భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అక్కడ మేయర్‌ గా తనను ఎంపిక చేయలేదంటూ.. ఓ కార్పొరేటర్‌ పార్టీ కార్యాలయం వద్ద నానా రచ్చ చేయడం మాత్రమే కాదు, జడ్పీటీసీ సభ్యురాలు కూడా అయిన తన భార్యతో కలిసి నానా రభస చేసేసి.. చివరికి కార్పొరేటర్‌గా కూడా ప్రమాణం చేయకుండా ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఒక రకంగా చెప్పాలంటే తెరాస శ్రేణులకు ఇదిచాలా చిత్రమైన అనుభవం కావొచ్చు. గులాబీ బాస్‌ ఏం చెబితే దానికి తలూపడం, ఆమోదించడం తప్ప రెండేళ్లుగా తమ సొంత అభిప్రాయాలు చెప్పడం, అసంతృప్తి ఉంటే వెలిబుచ్చడం అలవాటు తప్పిపోయిన వారికి ఖమ్మంలో వైనం చిత్రంగానే ఉంటుంది.

ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌గా డాక్టర్‌ పాపాలాల్‌ను పార్టీ ఎంపిక చేసింది. ఆయన ఏకగ్రీవంగా పదవిని స్వీకరించారు. అయితే మరో కార్పొరేటర్‌ ధరావత్‌రామ్మూర్తి నాయక్‌ కూడా చాలా కాలం నుంచి కార్పొరేటర్‌ పదవిని ఆశిస్తున్నారు. ఆయన భార్య భారతి ఖమ్మం రూరల్‌ జడ్పీటీసీ సభ్యురాలు కూడా! తనకు పదవి రాకపోవడంతో ఆయనలో అసంతృప్తి కట్టలు తెంచుకుంది. దీంతో ఆ దంపతులు ఇద్దరూ కలిసి ఖమ్మం పార్టీ కార్యాలయం వద్ద నానా బీభత్సం సృష్టించారు. ఎంతో కాలం నుంచి పార్టీకోసం కష్టపడి పనిచేస్తోంటే.. మేయర్‌ పదవి ఇవ్వకుండా మోసం చేశారంటూ నానా రభస చేశారు. మేయర్‌ ఎన్నిక కోసం పార్టీ ఆఫీసునుంచి కార్పొరేటర్లను తీసుకువెళ్తున్న వ్యానును అడ్డుకుని గొడవచేయడంతో పాపాలాల్‌ వర్గీయులకు వారికి మధ్య రచ్చ జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని.. రామ్మూర్తి నాయక్‌ను అరెస్టు చేసి తర్వాత సొంత పూచీకత్తుపై వదిలేశారు. ఆయన తన ధిక్కారాన్ని ఏ రేంజిలో వినిపించారంటే… చివరికి మామూలు కార్పొరేటర్‌గా కూడా పదవీ స్వీకార ప్రమాణం చేయకుండానే మిన్నకుండిపోయారు.

కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే వారు కూడా ఆ పార్టీలో ఉండడం ఆశ్చర్యకర పరిణామమే. రామ్మూర్తి నాయక్‌ మీద పార్టీ చర్య తీసుకుంటుందా? లేదా, బుజ్జగిస్తుందా? అనే విషయంపై పార్టీలో ఇప్పుడు చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close