కోడికత్తి కేసు డీటైల్స్ ఇక బయటకు రావు..!

వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కోడికత్తి కేసుకు సంబంధించిన విచారణ వివరాలు ఇక బయటకు రావు. అత్యంత గోప్యంగా విచారణ జరపాలని.. ఎన్‌ఐఏ కోర్టు ఈ మేరకు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. సాక్షులు, నిందితులు, న్యాయవాదుల భద్రత దృష్ట్యా.. కోర్టులో జరిగే విచారణ వివరాలు బయటకు తెలియకూడదని కోర్టు నిర్ణయించింది. ఇది ఓ రకంగా అసాధారణ పరిణామంగానే భావిస్తున్నారు. ప్రతిపక్షనేతపై జరిగిన కోడికత్తి కేసులో.. ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. అసలు ఈ కేసును..ఎన్‌ఐఏ విచారణ చేయడంపైనే.. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్రానికి అధికారం లేకపోయినా కుట్ర పూరితంగా ఎన్‌ఐఏకు.. కేసు ఇచ్చిందని.. కోర్టులో పిటిషన్ కూడా వేసింది.

కోడికత్తి కేసు మొదటి నుంచి .. రాజకీయ సంచలనంగా మారింది. విమానాశ్రయంలో దాడి జరిగిన తర్వాత… హైదరాబాద్ వెళ్లిపోయిన జగన్.. అక్కడ చికిత్స పొందారు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పి.. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కోసం కోర్టులో పిటిషన్లు వేశారు. ఈ లోపు.. జగన్ కు చెందిన మీడియా… సొంత విచారణ చేసి.. అంతా టీడీపీ నేతల పనేనని ఆరోపణలు ప్రారంభించింది. విశాఖ పోలీసులు ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి చేసిన విచారణలో.. నిందితుడు శ్రీనివాసరావు… జగన్‌కు సానుభూతి రావడం కోసమే చేశానని అంగీకరించారు. సిట్ విచారణలో కూడా దాదాపుగా అదే వెల్లడయింది. కానీ.. ఎన్ఐఏ అధికారులు .. చార్జిషీట్‌ను మాత్రం… అసంపూర్తిగా దాఖలు చేశారు. ఎన్‌ఐఏ విచారణకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదు.

మరో వైపు ఈ కేసు రాజకీయంగా సంచలనాత్మకంగా మారడంతో… మీడియా ప్రతీ క్షణం అప్ డేట్స్ ఇస్తోంది. చివరికి.. కోర్టు సీక్రెట్‌గా ఉండాలని సూచించిన.. చార్జిషీట్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. దీంతో.. పాటు.. కేసు సున్నితత్వం దృష్ట్యా.. కేసుతో సంబంధం ఉన్న వారి భద్రతకు… ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళనలు రావడంతో.. కోర్టు.. గోప్యంగా.. విచారణ జరగాలని నిర్దేశించింది. ఈ మేరకు.. ఏ వివరాలు మీడియాలో రాకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close