16లోపే రవిప్రకాష్, శివాజీల అరెస్ట్ ..! అసలు టార్గెట్ వేరే..?

టీవీ9 అమ్మకం, కొనుగోలు వ్యవహారంలో… అడ్డం పడి ఇరుక్కుపోయిన మాజీ సీఈవో రవిప్రకాష్‌కు అరెస్ట్ ముప్పు పొంచి ఉంది. విచారణకు హాజరు కావాలని.. ఇప్పటికి సీఆర్పీసీ 161 కింద రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే.. రవిప్రకాష్ మాత్రం వాటిపై స్పందించలేదు. ఆయన లాయర్ పది రోజులు గడువు కావాలని పోలీసులకు విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోలేదు. పైగా వెంటనే… 41 సీఆర్పీసీ సెక్షన్‌ కింద నోటీసు జారీ చేశారు. ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ నెల 15న ఉ. 11 గంటలకు హాజరుకావాలని సైబరాబాద్‌ పోలీసులు రవిప్రకాష్ కు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.

పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారా…?

టీవీ9 వ్యవహారంలో… ఏం జరిగిందో తెలుసుకునేందుకు… పెద్ద ఎత్తున పరిచయస్తులు అదే పనిగా ఫోన్లు చేస్తూండటంతో… రవిప్రకాష్… ఫోన్లు స్విచ్చాఫ్ చేశారు. తన భవిష్యత్ కార్యాచరణపై సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు. అయితే.. ఫోన్ చేస్తే తమకు అందుబాటులోకి రాలేదన్న కారణం చూపి.. కొన్ని మీడియా సంస్థలు ఆజ్ఞాతంలోకి పోయారంటూ ప్రచారం ప్రారంభించారు. ఇలాంటి ప్రచారాన్ని పట్టించుకోని రవిప్రకాష్.. న్యాయపరంగా.. ఎదుర్కోవాలని.. నిర్ణయించుకున్నారు. ఈ దిశగా.. తన లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. పోలీసుల తీరు అనూహ్యంగా ఉందని.. కావాలనే టార్గెట్ చేసినట్లుగా.. ఉందన్న అభిప్రాయంతో రవిప్రకాష్ టీం ఉంది. దీనికి వారు అనేక కారణాలు చూపిస్తున్నారు. పోలీసులు… టీవీ9 కొత్త యాజమాన్యం కుమ్మక్కయిందని.. రవిప్రకాష్ నేరుగానే చెబుతున్నారు. తాజా పరిణామాలు కూడా అవే నిరూపిస్తున్నాయని అంటున్నారు.

16న ఎన్సీఎల్టీలో కేసు విచారణ..! 15నే అరెస్ట్ చేయాలని వ్యూహమా..?

నిజానికి అసలు టీవీ9 అమ్మకం వివాదం.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఉంది. దీనిపై కేసు విచారణ పదహారో తేదీన విచారణకు రానుంది. ఆ కేసు చాలా క్లిష్టమైనది. ప్రస్తుతం ఉన్న పరిణామాలు.. గతంలో వివిధ కంపెనీల తరపున ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పుల వివరాలను చూస్తే… ప్రస్తుతానికి టీవీ 9… కొనుగోలు ప్రక్రియను నిలిపి వేసే అవకాశం ఉంది. మైనార్టీ షేర్ హోల్డర్ల ప్రయోజనాలు, గతంలో మారిషస్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ వ్యవహారంలో ఇచ్చిన ఆదేశాలు.. లాంటివన్నీ పరిశీలిస్తే… టీవీ9 కొత్త యాజమాన్యం పరిమితులు దాటిపోయిందన్న విషయం స్పష్టమవుతుంది. ఈ కారణంగా ఎన్సీఎల్టీ లో విచారణ చాలా కీలకం. దీని ఎదుటకు హాజరు కాకుండా… రవిప్రకాష్, శివాజీలను నిలువరించే ఉద్దేశంతోనే.. పోలీసులతో.. కలిసి.. ఈ నోటీసులు జారీ చేయించి.. భయభ్రాంతాలకు గురి చేసి… పరారీలో ఉన్నారనే భావన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు.. కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి.

శివాజీకి నోటీసుల వెనుకా అదే వ్యూహమా..?

నిజానికి టీవీ9లో జరిగినట్లు పెట్టిన ఫోర్జరీ కేసుకు .. శివాజీకి సంబంధం ఏముంది..?. రవిప్రకాష్ షేర్లను.. తాను కొనుగోలు చేసినట్లు ఓ తెల్ల కాగితంపై రాసుకున్నారు. తెల్లకాగితంపై రాసుకున్నారో… బాండ్ పేపర్‌పై రాసుకుంటో.. అది రవిప్రకాష్, శివాజీల మధ్య వ్యవహారం. అది చెల్లుతుందో లేదో చెప్పడానికి కంపెనీల వ్యవహారాలను పర్యవేక్షించే సంస్థలు చూసుకుంటాయి. ఆ ఫోర్జరీ వ్యవహారంతో… శివాజీకి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ.. పోలీసులు శివాజీకి నోటీసులు జారీ చేశారు. పరారీలో ఉన్నారని.. ఆజ్ఞాతంలో ఉన్నారని.. మీడియాకు లీకులిస్తున్నారు. కానీ.. శివాజీ, రవిప్రకాష్‌ల మధ్య తెల్లకాగితంపై జరిగిన ఆ ఒప్పందం.. మొత్తం టీవీ9 కొనుగోలు వ్యవహారానికి బ్రేక్ వేసినా ఆశ్చర్యం లేదన్న భావన కార్పొరేట్ వర్గాల్లో ఉంది. ఇలాంటి వ్యవహారాల్లో రాటుదేలిన కొత్త యాజమాన్యం.. అందుకే.. ఉన్న పళంగా… తమ పలుకుబడిని ఉపయోగించిందంటున్నారు. మొత్తానికి కార్పొరేట్ వార్ లో.. తెలంగాణ పోలీసులు దూకుడు మీద ఉన్నారు. వీటిని రవిప్రకాష్ ఎలా ఎదుర్కొంటాడో .. చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close