గోడ దూకితే త‌ప్పేంటి?

దాస‌రి ఇంటి గొడ‌వ – పోలీసు స్టేష‌న్ మెట్లెక్కింది. త‌న త‌మ్ముడు త‌న ఇంట్లోకి దౌర్జ‌న్యంగా ప్ర‌వేశించాడ‌ని, త‌న‌ని దుర్భాష‌లాడాడ‌ని, ఇంటి బీరువా తెర‌వ‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని దాస‌రి ప్ర‌భు.. దాస‌రి అరుణ్ కుమార్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు అరుణ్ కుమార్‌పై కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు కూడా చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో దాస‌రి అరుణ్ కుమార్ స్పందించారు. త‌న ఇంటి గోడ తాను దూకితే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించారు. త‌న తండ్రి వీలునామా ప్ర‌కారం ఆ ఇంటిలో త‌న‌కీ భాగం ఉంద‌ని గుర్తు చేశారు. తండ్రి రాసిన వీలునామాని ప్ర‌భు చూపించాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భు ఆరోపించిన‌ట్టు త‌న తండ్రి ఆస్తులు తాను ఎవ‌రికీ అమ్మ‌లేద‌ని క్లారిటీ ఇచ్చారు. త‌మ‌ది చిన్న గొడ‌వ‌లే అని, కూర్చుని మాట్లాడుకుంటే ప‌రిష్కారం అయిపోతాయ‌ని, కోర్టుకి వెళ్లాల్సిన ప‌నిలేద‌ని అన్నారు అరుణ్ కుమార్‌. ఈ విష‌యంలో సినిమా పెద్ద‌లు జోక్యం చేసుకుని ప‌రిష్కారం చూపిస్తే, అందుకు త‌న‌కు అభ్యంత‌రం ఏమీ లేద‌ని చెప్పుకొచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close