అమెరికాలో విస్తరిస్తున్న  “రేసిజం వైరస్..!”

కరోనా దెబ్బకు అమెరికా వణికిపోతూంటే.. తాజాగా… పోలీసుల ఆకృత్యం వల్ల ఆఫ్రికన్ అమెరికన్ మరణించడం.. మరింతగా ఇబ్బంది పెడుతోంది. నల్ల జాతీయుడిని పోలీసుల అకారణంగా చంపడంపై నిరసనలు హింసకు దారి తీసేలా జరుగుతున్నాయి. అవి అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇతర చోట్లకు వ్యాపిస్తూనే ఉన్నాయి. వారం రోజుల కిందట..  ఫ్లాయిడ్ అనే ఆఫ్రికా అమెరికన్‌ చేతులకు బేడీలు వేసి రోడ్డుపై పడేసి అతడి మెడపై మోకాలితో తొక్కుతూ ఓ పోలీస్ పైశాచికానందం పొందాడు. చివరికి ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ వీడియో అమెరికాలోని నల్లజాతీయుల రక్తాలను మరిగించింది.

జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతిపై నిరసన సెగలు చెలరేగాయి. ఘటన జరిగిన మిన్నియాపొలిస్‌ నుంచి అన్ని రాష్ట్రాలకు, నగరాలకు విస్తరించాయి. ఫ్లాయిడ్‌ మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలంటూ అమెరికన్లు రోడ్డెక్కారు. పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసన ప్రదర్శనల్లో లూటీలు జరుగుతున్నాయి. దీంతో అమెరికాలో ఇప్పుడు పరిస్థితి గంభీరంగా మారింది.  చోట్ల పలు దుకాణాలు, వ్యాపార సముదాయాలకు నిప్పు పెట్టారు. కొన్ని మాల్స్, వాహనాలపై రాళ్లు రువ్వడం వంటివి చోటు చేసుకున్నాయి. ఫ్లాయిడ్ మృతికి కారణం అయిన పోలీసులపై చర్యలు తీసుకుంటే.. నల్లజాతీయులు శాంతిస్తారని అనుకున్నారు. కానీ ఆ పోలీస్‌ను అదుపులోకి తీసుకున్న నిరసనలు అలా పెరుగుతూనే ఉన్నాయి.

ఈ నిరసనలను డీల్ చేయడానికి ప్రయత్నించకపోగా.. ట్రంప్ మాటలతో మరింతగా పరిస్థితి విషమిస్తోంది. లూటింగ్ చేసేవారిని షూట్ చేయాలంటూ.. ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమయింది. సైన్యాన్ని రంగంలోకి దింపుతామంటూ వస్తున్న హెచ్చరికలు.. నల్లజాతీయుల్ని మరింతగా రెచ్చగొట్టేలా ఉన్నాయి. న్యూయార్క్‌లో 2014లో ఎరిక్‌ గార్నర్‌ అనే నల్లజాతి వ్యక్తి హత్య తర్వాత అమెరికాలో జాతివివక్ష దాడులపై ఆందోళనలు పెరిగాయి. బ్లాక్‌ లైవ్స్ మ్యాటర్‌ పేరుతో ఆందోళకారులు ఈ తరహా దాడులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇప్పడు ఫ్లాయిడ్‌ మృతి అమెరికాను కుదిపేస్తోంది.  

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శేఖర్ రెడ్డి వద్ద దొరికిన ఆ “కోట్లు” సాక్ష్యాలు కావా..!?

టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్‌రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆయన నేరాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని.. కేసు మూసివేయవచ్చని సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పడంతో ఈ మేరకు కోర్టు...

ఏపీ సర్కార్‌పై అశ్వనీదత్, కృష్ణంరాజు న్యాయపోరాటం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాపై సినీ నిర్మాత అశ్వనీదత్, రెబల్ స్టార్ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్లు వేశారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తమ భూముల్ని తీసుకుని ఇస్తామన్న పరిహారం...

స్వరశిల్పి బాలుకు స్వరనివాళులర్పించిన తానా – వీక్షించిన 50,000 మంది…

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో గానగంధర్వుడు, పద్మభూషణ్‍ డాక్టర్ ఎస్‍.పి. బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా "స్వరశిల్పికి స్వర నివాళి" పేరుతో ఆన్‍లైన్‍ వేదికగా ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమానికి పలువురు...

అపెక్స్ కౌన్సిల్‌ భేటీకి మరోసారి ముహుర్తం..!

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్రం మరో ప్రయత్నం చేస్తోంది. అపెక్స్ కౌన్సిల్ భేటీని వచ్చే నెల ఆరో తేదీన ఏర్పాటు చేస్తూ ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఈ మేరకు...

HOT NEWS

[X] Close
[X] Close