రవిప్రకాష్‌పై ఆరోపణలు- నిజాలు..! ఆయన క్యాంప్ వివరణ ఏమిటి..?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన అంశం.. టీవీ9 అమ్మకం వివాదం. ఆ నేపధ్యంలో… ఆ సంస్థకు నారు, నీరు పోసి.. మొక్క స్థాయి నుంచి… వటవృక్షంగా మలిచిన రవిప్రకాష్ తొలగింపు అంశం కూడా చర్చనీయాంశమయింది. అంతే కాదు.. రవిప్రకాష్ పై ఈ క్రమంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఫోర్జరీ కేసు కూడా నమోదయింది. ఆజ్ఞాతంలో ఉన్నాడని.. పరారీలో ఉన్నారని.. మీడియాలోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో అసలు.. రవిప్రకాష్ పై ఉన్న ఆరోపణలు ఏమిటి..? దీనికి ఆయన టీం ఇస్తున్న వివరణలేమిటి.. ? అన్న అంశాలను… పాఠకులకు అందించడానికి తెలుగు360 ప్రయత్నం చేసింది. రవిప్రకాష్ పై ఉన్న ఆరోపణలు.. దానిపై ఆయన టీం ఇస్తున్న వివరణలు… తెలుసుకుంది. ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని.. ఒక్క రవిప్రకాష్ టీం దగ్గర్నుంచే కాకుండా.. చానల్‌లో ఇప్పటికీ పని చేస్తున్న కొంత మంది కీలక ఉద్యోగులతో కూడా మాట్లాడి..సమాచారాన్ని సరిపోల్చుకోవడం జరిగింది. ఆ వివరాలు ..!

ఆభియోగం 1 : ఏబీసీఎల్ కంపెనీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన రవిప్రకాష్

రవిప్రకాష్.. టీవీ9 యాజమాన్య సంస్థ అయిన ఏబీసీఎల్ కంపెనీ సెక్రటరీ దేవేందర్ అగర్వాల్ ..సంతకాన్ని ఫోర్జరీ చేసి.. కొత్త డైరక్టర్ల నియామకానికి అడ్డు తగిలే ప్రయత్నం చేశారన్నది ప్రధానమైన ఆరోపణ. నిజానికి ఏబీసీఎల్ కంపెనీ సెక్రటరీ దేవందర్ అగర్వాల్ మే 28వ తేదీన రాజీనామా చేశారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఆయన నిర్ణయం మార్చుకోకపోవడంతో… డైరక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది కూడా. ఈ విషయం కార్పొరేట్ వ్యవహారాల శాఖలో కూడా నమోదయింది. అయితే.. కొత్త యాజమాన్యం అక్రమ పద్దతిలో.. డైరక్టర్లను నియమించడానికి… రాజీవామా చేసిన దేవందర్ అగర్వాల్ ద్వారా ప్రయత్నించింది. అయితే.. అప్పటికే అగర్వాల్ రాజీనామా ఆమోదం పొందడంతో.. కొత్త డైరక్టర్ల నమోదు సాధ్యం కాలేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఫోర్జరీ అనే ప్రశ్నే రాదు. రాజీనామా పత్రంపై ఫోర్జరీ సంతకం పెడితే.. కంపెనీ సెక్రటరీ అయిన అగర్వాల్ నెల రోజుల పాటు ఎందుకు కామ్‌గా ఉంటారు..?. అసలు ఇక్కడ ఫోర్జరీ అనే కేసే లేదు. పైగా కొత్త డైరక్టర్లను అక్రమంగా నియమించడం ద్వారా కొత్త యాజమాన్యమే తప్పు చేసిందని..రవిప్రకాష్ క్యాంప్ చెబుతోంది.

అభియోగం 2: డైరక్టర్ల నియామకాన్ని అడ్డుకోవడానికే శివాజీతో తెల్ల కాగితంపై షేర్ల అమ్మకం ఒప్పందం చేసుకున్నారు..!

శివాజీతో..రవిప్రకాష్ షేర్ల అమ్మకం ఒప్పందంపైనా కొత్త యాజమాన్యం ఆరోపణలు చేస్తోంది. ఆయన తెల్లకాగితంపై అమ్మకపు ఒప్పందం చేసుకున్నారని..మరొకటని.. రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల.. కొత్త డైరక్టర్ల నియామకానికి అడ్డుతగిలే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై.. రవిప్రకాష్ టీం…ఆశ్చర్యం వ్యక్తం చేసింది. శివాజీ – రవిప్రకాష్ మధ్య జరిగిన షేర్ల అమ్మకం.. పూర్తిగా ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అంశం. రవిప్రకాష్ తన షేర్లను అమ్మాలనుకున్నారు. శివాజీ కొనుక్కోవాలనుకున్నారు. అది ఇద్దరికి సంబంధించిన విషయం అయితే.. అది కొత్త డైరక్టర్ల నియామానికి.. ఎలా అడ్డంకి అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అసలు వివాదానికి.. శివాజీకి షేర్ల అమ్మే విషయానికి.. కొత్త డైరక్టర్ల నియామకానికి అడ్డం పడటం.. అనే అంశానికి అసలు పొంతనే లేదని చెబుతున్నారు. కేవలం ఆరోపణలు చేయాలి కాబట్టి.. ఈ అంశంపై ఆరోపణలు చేస్తున్నారని రవిప్రకాష్ టీం చెబుతోంది.

అభియోగం 3 : టీవీ9 నిధులు మోజో టీవీకి మళ్లించారు..!

రవిప్రకాష్‌పై కొత్త యాజమాన్యం చేస్తున్న మరో ఆరోపణ మోజో టీవీకి నిధులు తరలించడం. ఇది పూర్తిగా అవాస్తవమైన ఆరోపణ అని టీవీ9లో పని చేస్తున్న మార్కెటింగ్ సిబ్బంది చెబుతున్నారు. ఎందుకంటే.. టీవీ9తో..మోజో టీవీకి మార్కెటింగ్ ఒప్పందం ఉంది. టీవీ9 నెంబర్ వన్ చానల్. అత్యధికంగా యాడ్స్ వస్తాయి. అలాంటి సమయంలో… మార్కెటింగ్ స్టాఫ్.. తమకు వచ్చే యాడ్స్ ను టీవీ9లో అకామిడేట్ చేయలేనప్పుడు… కొన్నింటినీ… మోజో టీవీకి ఇస్తుంది. అలా ఇవ్వడం వల్ల పది శాతం కమిషన్ టీవీ9కి వస్తుంది. ఇది అదనపు ఆదాయమే కానీ…టీవీ9 నుంచి మోజో టీవీకి నిధులు తరలించేదేమీ ఉండదు. పైగా ఇదంతా.. పూర్తిగా డాక్యుమెంట్లతో సహా ఉన్న ఒప్పందం. ఇందులో తప్పుపట్టడానికి కూడా ఏమీ లేదని..మార్కెటింగ్ సిబ్బంది చెబుతున్నారు.

అభియోగం 4 : భారత్ వర్ష్ చానల్‌ నిధుల దుర్వినియోగం..!

రవిప్రకాష్‌పై కొత్త యాజమాన్యం చేస్తున్న మరో ఆరోపణ..కొత్తగా ప్రారంభించిన టీవీ9 భారత్ వర్ష్ చానల్‌ విషయంలో నిధులు దుర్వినియోగం చేయడం.. మళ్లించడం. కానీ..నిజానికి టీవీ9 భారత్ వర్ష్ చానల్‌కు అనుకున్న బడ్జెట్ కంటే.. సగమే ఖర్చయింది. పెట్టుబడిని సగం ఆదా చేయడంలో రవిప్రకాష్‌ది కీలక పాత్ర. అంతే కాదు.. ఆ చానల్‌కు.. బజ్ తీసుకు రావడంతో..రవిప్రకాష్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. తనకు ఉన్న పరిచయాలతోనే.. మోడీ.. ఎన్నికల ప్రచారంలో ఎంతో బిజీగా ఉన్నప్పటీకీ… చానల్ లాంచింగ్‌కు తీసుకు రాగలిగారన్న విషయాన్ని రవిప్రకాష్ టీం చెబుతోంది.

రవిప్రకాష్ పై వస్తున్న ఆరోపణల విషయంలో.. ఆయన టీం, సన్నిహితులు స్పష్టమైన విషయాల్ని బయటకు వెల్లడిస్తున్నారు. అయితే రవిప్రకాష్ మాత్రం.. స్ట్రాటజిక్‌గా మౌనం పాటిస్తున్నారు. రవిప్రకాష్ వ్యూహం ఏమిటో కానీ.. ఆయన ఎక్కువ కాలం ఈ ఆరోపణల్ని సహించరని..మొత్తం వ్యవహారాన్ని..కొత్త యాజమాన్యం కుట్రల్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తారని.. ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఏం జరగబోతోందో…వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close