బాల‌య్య ప‌క్క‌క ఖిలాడీ భామ‌

నంద‌మూరి బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఇదో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. టైటిల్ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. కాక‌పోతే.. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో బాల‌య్య‌పై ఓ గీతాన్ని తెర‌కెక్కిస్తున్నారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య రీతులు స‌మ‌కూరుస్తున్న ఈ పాట‌కి త‌మ‌న్ సంగీతం అందించాడు. ఈ పాట‌లో.. బాల‌య్య సిగ్నేచ‌ర్ స్టెప్పులు అద‌ర‌గొట్టేశాడ‌ని స‌మాచారం. హీరో ప‌రిచ‌య గీత‌మే అయినా, ఓ ర‌కంగా ఐటెమ్ సాంగ్ లా ఈ పాట‌ని తెర‌కెక్కిస్తున్నార్ట‌. ఈ పాట‌లో డింపుల్ హ‌య‌తి బాల‌య్య‌తో క‌లిసి స్టెప్పులు వేయ‌బోతోంద‌ని టాక్. ఖిలాడీలో ర‌వితేజ‌తో న‌టించింది డింపుల్. ఆ సినిమా ఫ్లాప్ అయినా, డింపుల్ కి బాగానే అవ‌కాశాలొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బాల‌య్య సినిమాలో ఆఫ‌ర్ కొట్టేసింది. శ్రుతిహాస‌న్ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ...

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close